YS Jagan: విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ విషయంలో కూటమి సర్కార్, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. ఈ వ్యవహారంలో మరోసారి సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.. గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారని ఆరోపించారు.. అసలు చంద్రబాబు చేసింది ఏముంది? అని నిలదీశారు.. సింగపూర్ నుంచి కేబుల్ తీసుకురావడానికి అంకురార్పణ చేసింది వైయస్సార్‌సీపీ.. అదానీ-గూగుల్‌కు 2022లో నోయిడా డేటా సెంటర్ అగ్రిమెంట్ ఉంది. మనం ఇక్కడ కూడా భూములు ఇచ్చాం, అన్ని ఏర్పాట్లూ జరిగాయి. ఆ రోజు అడుగులు వేశాం కాబట్టి.. ఇప్పుడు గూగుల్ వస్తోందన్నారు.. మూలపేట ప్రారంభించి మనం కట్టుకుంటూ వెళ్లాం కాబట్టి ఇప్పుడు మూలపేట పోర్టు జరుగుతోంది.. భోగాపురం ఎయిర్‌పోర్టుకు అన్ని అనుమతులు తీసుకొచ్చి మనం శరవేగంగా నిర్మాణాలు చేశాం.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చంద్రబాబు చేస్తున్న అత్యంత దరిద్రపు పని.. మంచి చేయకపోగా, చెడు చేస్తున్నాడు అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు..
Read Also: Singer Maithili Thakur: ఆర్జేడీ కంచుకోటలో మైథిలి ఠాకూర్ రాణించగలరా?
ఏపీలో 2019 వరకూ ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 12 అయితే.. చంద్రబాబు ఒక్కటి కూడా తేలేదు.. ఐదేళ్లలో కోవిడ్ రెండేళ్లు తీసేస్తే, మూడేళ్లలో 17 మెడికల్ కాలేజీలు తీసుకు వచ్చాం అని తెలిపారు వైఎస్ జగన్.. ప్రతి జిల్లాకో గవర్నమెంటు మెడికల్ కాలేజీ తీసుకు వచ్చాం.. 17 కొత్త మెడికల్ కాలేజీల వల్ల 2,550 సీట్లు అందుబాటులోకి వస్తాయి.. సగం సీట్లు ఉచితం, మిగిలిన సీట్లు తక్కువ రేటుకే అందుబాటులోకి వస్తాయి.. మన పిల్లలు ఇక్కడే డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుంది.. 6 మెడికల్ కాలేజీలు సీట్లు ప్రారంభం అయ్యాయి.. పాడేరు కూడా ఎన్నికల తర్వాత ప్రారంభం అయ్యింది.. 800 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.. పులివెందుల కాలేజీకి 50 సీట్లు కేంద్రం ఇస్తే.. వద్దంటూ చంద్రబాబు లెటర్ రాశాడు.. మిగిలిన 10 కాలేజీలకు రూ.5వేల కోట్లు పెడితే చాలు.. ఏడాదికి రూ.వేయి కోట్లు పెట్టినా చాలు.. కానీ, చంద్రబాబుకు మనసు రాదు అని ఫైర్ అయ్యారు.. ఆయన పెట్టకపోయినా పర్వాలేదు, అలా వదిలేస్తే మేం వచ్చాక కట్టుకుంటాం కదా? అని ప్రశ్నించారు..
Read Also: Shilpa Shetty – Raj Kundra: శిల్పా శెట్టి దంపతులపై రూ.60 కోట్ల మోసం కేసు.. కొత్త మలుపు!
ఇలాంటి వాటిపై ప్రశ్నలు వేసి, నిలదీసే బాధ్యత మీది అంటూ విద్యార్థులకు సూచించారు వైఎస్ జగన్.. రాష్ట్రంలో కోటి సంతకాల కార్యక్రమం జరుగుతోంది. మీరంతా చురుగ్గా పాల్గొనాలి. గ్రామస్థాయిలో కూడా విద్యార్థి విభాగం, యూత్ విభాగం రావాలి.. మీ చేతుల్లోనే భవిష్యత్తు ఉంది… మీరు ఎవర్ని డిసైడ్ చేస్తే.. ఆ ప్రభుత్వం వస్తుంది… విద్యార్థి, యువకులకున్న శక్తి అది.. తటస్థులను, భావసారూప్యత ఉన్న వ్యక్తులను కూడా కలుపుకోవాలి.. అసెంబ్లీ కేంద్రాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీలు 11 నుంచి 12వ తేదీకి మార్చాం.. డిసెంబర్‌లో ఫీజు రియింబర్స్‌మెంట్‌పై ఆందోళనలు ఉంటాయి.. అంతవరకూ చంద్రబాబుకు సమయం ఇద్దాం అని వ్యాఖ్యానించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్..
