Site icon NTV Telugu

Botsa Satyanarayana: చరిత్రను చెరిపేయడం సాధ్యం కాదు.. డస్టర్ పెట్టి తుడిస్తే చరిత్ర మాసిపోదు..!

Botsasatyanarayana

Botsasatyanarayana

Botsa Satyanarayana: చరిత్రను చెరిపేయడం సాధ్యం కాదు.. డస్టర్ పెట్టి తుడిస్తే చరిత్ర మాసిపోదు అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. వైఎస్సార్ జిల్లా పేరును మార్చిన ప్రభుత్వం… NTR జిల్లా పేరు వెనుక విజయవాడను ఎందుకు చేర్చలేదు..? అని ప్రశ్నించారు.. కుచితమైన ఆలోచనలతో టీడీపీ వ్యవహరి స్తోంది అని దుయ్యబట్టారు.. ప్రభుత్వం సింగిల్ పాయింట్ అజెండా ఫాలో అవుతోంది.. చరిత్రను చెరిపేయడం సాధ్యం కాదు.. డస్టర్ పెట్టి తుడిస్తే చరిత్ర మాసిపోదు అని స్పష్టం చేశారు..

Read Also: Daggubati Prasad: వైసీపీ నేతలకు మైండ్‌ బ్లాక్‌ అయ్యింది.. గాలి తరహాలో జగన్‌ కూడా..!

ఇక, కడపలో అధికార పార్టీ డ్రామా ఎపిసోడ్ నడిపింది అంటూ మహానాడుపై సెటైర్లు వేశారు బొత్స.. ఏడాది పాలనలో ఏం చేశామో చెప్పుకోలేక ప్రజలను మభ్య పెట్టేందుకు తాపత్రయపడ్డారన్న ఆయన.. సొల్లు కబుర్లు, ఆత్మస్తుతి – పర నిందకు మహానాడు పరిమితం అయ్యిందన్నారు.. సూపర్ సిక్స్ అమలు చేయలేకపోయినందుకు మహానాడు వేదికగా ఎందుకు ప్రజలకు సంజాయిషీ ఇవ్వలేదు.. తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.. జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, పాసింగ్ రిమార్క్స్ తప్ప ఏడాదికాలంలో ఏం చేశారు.. పథకాలు ఎప్పుడు ఇస్తారో ఎందుకు చెప్పలేదు…? విద్యార్థులు భవిష్యత్ తో చెలగాటం ఈ ప్రభుత్వానికి న్యాయమా..? అంటూ మండిపడ్డారు.. పదో తరగతి మార్కులు రీ వెరిఫికేషన్ కోసం 16వేల 500మంది అప్లయ్ చేయడం గతంలో ఎన్నడూ జరగలేదన్నారు.. మా హయాంలో ఐదు వేల కంటే ఒక్కరు ఎక్కువగా కరెక్షన్ వచ్చినట్టు నిరూపించగలరా…? రికార్డులు చూడండి అని సవాల్‌ చేశారు.. మీరు సమీక్ష పెట్టండి నేను ప్రతిపక్ష నాయకుడు హోదాలో వచ్చి పాల్గొంటాను… బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారు.. పాత విధానం నుంచి ఎందుకు పక్కదారి పట్టించారు.. సమాధానం చెప్పాలని నిలదీశారు.. మహానాడులో టీడీపీ నాయకులు వాడిన భాష పట్ల అక్షేపిస్తున్నాం.. ఖండిస్తున్నాం అన్నారు ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ..

Exit mobile version