CM Chandrababu: ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీ సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఇక, ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఎక్కడికి వెళ్లినా ఏపీలో ఒక బూతం ఉంది.. అది మళ్లీ లేస్తే ఎలా ఉంటుందని భయపడుతున్నారు.. నేను ఒకటే చెప్పా.. ఆ భూతాన్ని భూస్థాపితం చేశానని చెప్పా.. రాజకీయం అంటే తమాషా కాదు.. మోసాలు, నేరాలు చేసి ఎదుటి వారి మీద వేయడం కాదు అని పేర్కొన్నారు. తెల్లారితే ఎన్నికలు అనగా బాబాయ్ ని లేపేశారు.. బాబాయ్ గుండె పోటుతో చనిపోయాడని అంటే నేనూ నమ్మాను.. ఆ రోజు నేను దోషులను అరెస్ట్ చేసి, రికార్డులను సీజ్ చేసి ఉంటే మనం ఓడిపోయే వాళ్లం కాదు అని తెలిపారు. సాయంత్రానికి గుండె పోటు కాదు.. గొడ్డలి పోటు అని తేలడంతో నాటకాల రాయుడు మాట మార్చేశాడు అని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు.
Read Also: Jawahar Navodaya: కొత్తగా ఏడు కొత్త నవోదయ విద్యాలయాలు.. జూలై 14 నుండి ప్రారంభం..!
అయితే, బాబాయ్ ను చంపేసి సీఎం, మంత్రులపైన నెట్టేసి నారాసుర హత్య అన్నారని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తి మళ్లీ డ్రామాలు, నాటకాలు అడుతున్నారు.. కోడి కత్తి నాటకమే, గులకరాయి నాటకమే.. చివరికి ఇంటి దగ్గర మంటలు కూడా నాటకమేనని చెప్పుకొచ్చారు. ఇంట్లోని సీసీ ఫుటేజ్ ఇమ్మంటే ఇవ్వరు.. పొదిలి వెళ్లాడు.. అక్కడ ఏం చేశాడని ప్రశ్నించారు. ఇప్పటికే బర్లీ, పొగాకును రూ. 12 వేలకు కొనమని చెప్పా.. అపోజిషన్ లో ఉండి రౌడీయిజం చేస్తానంటే ఇక్కడ ఉంది సీబీఎన్.. రౌడీయిజం చేస్తాం, రుబాబు చేస్తాం, పోలీసుల మీద దాడి చేస్తానంటే నోరు మూయించే శక్తి టీడీపీకి ఉంది అని తేల్చి చెప్పారు. 1996-97లో తీవ్రవాద సమస్య, రాయలసీమలో ఫ్యాక్షన్, హైదరాబాద్ లో మత ఘర్షణలు, గల్లీకొక రౌడీ ఉంటే.. అన్నింటినీ అరికట్టాను.. పులివెందుల మార్క్ రాజకీయం చేస్తానంటే తోక కట్ చేస్తాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.
