NTV Telugu Site icon

Minister Kandula Durgesh: రుషికొండ బీచ్లో మళ్లీ బ్లూఫ్లాగ్ జెండాను ఎగరవేస్తాం..

Durgesh

Durgesh

Minister Kandula Durgesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో పర్యటక మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. రుషికొండ బీచ్ లో మళ్లీ బ్లూఫ్లాగ్ జెండాను ఎగరవేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత ప్రభుత్వ దుర్మార్గపు విధానాల అవశేషాలతో పర్యాటక రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఏపీలో బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏర్పాటుకు కేంద్రం అనుకూలం.. పర్యాటక అభివృద్ధికి ప్రతిబంధకంగా మారిన కోస్టల్ రెగ్యులేషన్ జోన్.. కేంద్ర ప్రభుత్వం నుంచి సడలింపు తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బీచ్ లో ఆక్రమణలు తొలగించడం, పరిశుభ్రత పాటించడం, ఎన్విరాన్ మెంట్ ఎడ్యుకేషన్ ను పెంపొందించడం లాంటి అంశాలపై దృష్టిసారించామని వెల్లడించారు. నెల్లూరు సమీపంలోని కోడూరు బీచ్ ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం.. యూరోపియన్ లు బీచ్, వెల్ నెస్ టూరిజంలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని మంత్రి దుర్గేష్ తెలిపారు.

Read Also: SK : నేచురల్ స్టార్ నాని బాటలో కోలీవుడ్ స్టార్ హీరో.. వర్కౌట్ అవుతుందా..?

ఇక, రాష్ట్రంలో 50,000 గదులను అందుబాటులోకి తీసుకు వస్తామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సముద్ర ఆధారిత పర్యాటకం అభివృద్ధి చేస్తాం.. సముద్ర ఆధారిత పర్యాటకం అభివృద్ధికి బృహత్తర ప్రణాళికను రూపొందిస్తున్నాం.. బీచులు, క్రూజింగ్ బోటింగ్, ఫిషింగ్, సర్ఫింగ్, పాడిల్ బోర్డింగ్, వాటర్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో 7 యాంకర్ హబ్స్, 25 థీమాటిక్ సర్క్యూట్ లను గుర్తించాం.. రాష్ట్రంలో విశాఖపట్టణం, శ్రీకాకుళం, కాకినాడ, నెల్లూరు, మచిలీపట్నంలను బీచ్ సర్క్యూట్ లుగా అభివృద్ధి చేస్తాం.. రివర్ క్రూయిజ్ సర్క్యూట్ క్రింద గోదావరి, కృష్ణా, కోనసీమ, బ్యాక్ వాటర్ లను అభివృద్ధి చేస్తాం.. బీచ్ రిసార్ట్సులతో పాటు బీచ్ వాలీబాల్ తదితర బీచ్ స్పోర్ట్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. టూరిజం పాలసీ 2024-29 తీసుకొచ్చినందుకు సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు.. టూరిజం సెక్టార్ కు ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చిన ఘనత చంద్రబాబుది అని పర్యటన శాఖ మంత్రి దుర్గేష్ వెల్లడించారు.