Site icon NTV Telugu

Fun Bucket Bhargav: మైనర్ బాలికపై లైంగిక దాడి కేసు.. ఫన్‌ బకెట్‌ భార్గవ్‌కు 20 ఏళ్ల శిక్ష

Fun Bucket Bhargav

Fun Bucket Bhargav

Fun Bucket Bhargav: మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో విశాఖపట్నం కోర్టు తీర్పు వెలువరించింది.. ఈ కేసులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌.. ఫన్ బకెట్ భార్గవ్ కు ఫోక్సో చట్టం కింద 20 ఏళ్ల కఠిన కారాగారా శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది కోర్టు.. అంతేకాదు.. ఈ కేసులో బాధితురాలికి 4 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు.. కాగా, టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యాడు ఫన్ బకెట్ భార్గవ్. వీడియోస్ చేసే క్రమంలో 14 ఏళ్ల మైనర్ బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడడం.. ఆ బాలికను గర్భవతిని చేశారు ఫన్ బకెట్ భార్గవ్. అయితే, బాలిక ఫిర్యాదుతో భార్గవ్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఇప్పుడు కోర్టు శిక్ష ఖరారు చేసింది..

Read Also: CM Revanth Reddy: ఆదివాసీల విద్య, ఉద్యోగ, ఆర్ధిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం..

కాగా, మైనర్‌ బాలికపై అత్యాచారం ఘటనలో 2021లోనే టిక్ టాక్ స్టార్, ఫన్ బకెట్ భార్గవ్ అలియాస్ చిప్పాడ భార్గవ్‌పై కేసు నమోదు అయ్యింది.. ఆ తర్వాత అరెస్ట్‌ చేశారు పోలీసులు.. ఇక, మైనర్ పై అత్యాచారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.. చాలామంది అమ్మాయిలు భార్గవ్ బాధితుల జాబితాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియా ఫేమ్ ని వాడుకుని తన కామ కోరికలు, అవసరాలు తీర్చుకునేందుకు వాడుకున్న భార్గవ్.. అమాయక యువతులను నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదులు వచ్చాయి.. టిక్ టాక్ లో స్టార్ ని చేస్తానని, పాపులర్ గా మారుస్తానని, మీడియాలో.. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి.. మభ్యపెట్టి చాలామంది యువతులను భార్గవ్ లోబర్చుకున్నాడన్న ఆరోపణలు వచ్చాయి.. ఇక, బాధితుల్లో 14 ఏళ్ల మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు.. ఇక, ఆ దృశ్యాలను వీడియో తీసి.. బ్లాక్‌ చేసి మళ్లీ మళ్లీ అత్యాచారానికి ఒడిగట్టినట్టు తేల్చారు.. అయితే, సదరు బాలకి గర్భం దాల్చడంతో భార్గవ్ నిజస్వరూపం బట్టబయలైంది. అతడిపై దిశ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయగా.. ఇప్పుడు కోర్టు శిక్ష ఖరారు చేసింది..

Exit mobile version