Site icon NTV Telugu

Vizag: శెభాష్.. 24 గంటల్లో మిస్సింగ్ కేసును చేధించిన విశాఖ సిటీ పోలీస్

Vishaka

Vishaka

తప్పిపోయిన కుటుంబ సభ్యులు, మహిళలు, బాలికలు, యువతల కేసుల్లో విశాఖ పోలీసులు పట్టుబట్టి కేసును చేధిస్తున్నారు. తాజాగా.. మరో మిస్సింగ్ కేసును విశాఖ పోలీసులు సాల్యూ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని కొత్తగూడెంకు చెందిన ఓ బాలిక మిస్సింగ్ కేసును 24 గంటల్లో చేధించి తల్లిదండ్రులకు అప్పగించారు. విశాఖ సీపీ శంకభ్రత బగ్చీ పర్యవేక్షణలో వన్ టౌన్ పోలీసులు క్షణాల్లో స్పందించిన తీరును బాలిక తల్లిదండ్రులు కొనియాడారు.

Read Also: Swati Maliwal: హీటెక్కిన ఢిల్లీ పాలిటిక్స్.. కేజ్రీవాల్ ఇంటి ముందు చెత్త వేసి స్వాతి మాలివాల్ నిరసన

కాగా.. కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ కుటుంబం విహారయాత్ర కోసమని విశాఖ వచ్చారు. హార్బర్ వ్యూ ల్యాడ్జీలో బసకు దిగారు. అయితే.. ఆ సమయంలో సదరు బాలిక ఎక్కువగా ఫోన్ చూస్తోందంటూ తల్లిదండ్రులు ఆమెను మందలించారు. దీంతో.. కోపంతో లాడ్జీ నుంచి బయటకు వెళ్లింది. ఈ క్రమంలో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు సీపీ బగ్చీకి వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు. వెంటన అప్రమత్తమైన పోలీసులు.. బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా.. సొంత కుటుంబ సభ్యుల్లా భావించి బాలిక తల్లిదండ్రులకు పోలీసులు వసతి కల్పించి, ఆహారం పెట్టించారు. అయితే.. 24 గంటల్లోపే బాలిక ఆచూకీ కనిపెట్టి వన్ టౌన్ పోలీసులు క్షేమంగా ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో బాధిత తల్లిదండ్రులు విశాఖ సిటీ పోలీసుల సేవలను అభినందించారు. సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Read Also: No Tax State : కోట్లు సంపాదించినా అక్కడ నో టాక్స్.. భారతదేశంలో పన్ను వసూలు చేయని రాష్ట్రం ఏదో తెలుసా..?

Exit mobile version