Site icon NTV Telugu

Joy Jamima: జాయ్‌ జెమీయా వలలో హైదరాబాద్ యువకుడు.. రూ.3 కోట్లకు డీల్

Vizag

Vizag

Visakha Honey Trap Case: డబ్భులు ఇవ్వకుంటే హనీ ట్రాప్ బాధితులను చంపడానికి కూడ వెనుకాడని జాయ్ జెమీమా.. పెద్ద గ్యాంగ్ నే మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు స్కెచ్ లు వేస్తుంది. జెమిమా నెట్ వర్క్ చూసి పోలీసులు షాక్ అవుతున్నారు. హనీ ట్రాప్ కేసులో విశాఖలోని పలు స్టేషన్ లకు బాధితులు క్యూ కడుతున్నారు. తాజాగా, జాయ్‌ జెమీమా వలలో చిక్కుకున్న మరో వ్యక్తి విశాఖ ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్ చేశాడు. హైదరాబాద్ యువకుడిని జెమిమా ట్రాప్ చేసి 3 కోట్ల రూపాయలకు డీల్ సెట్ చేసింది.. దఫా దఫాలుగా బాధితుడి దగ్గర నుంచి 1 కోటి రూపాయల వసూలు చేసినట్లు పేర్కొన్నాడు.

Read Also:IPPB Recruitment 2024: ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో GDS డైరెక్ట్ రిక్రూట్‌మెంట్

ఇక, హైదరాబాద్ కు చెందిన బాధితుడు నగరంలోని ఓ కంపెనీలో పని చేసేవాడు. కంపెనీ యజమాని బంధువుగా, ప్రాజెక్ట్ హెడ్ గా పరిచయం పెంచుకున్న కిలాడి లేడీ జెమిమా.. మత్తు స్ప్రే కొట్టి, జ్యూస్ లో మత్తు మందు కలిపి సన్నిహితంగా ఫోటోలు దిగింది. అప్పటి నుంచి డబ్భులు కోసం అతడ్ని బెదిరించింది. అందినకాడికి దోచుకుని ఇవ్వని క్రమంలో సన్నిహితులకు, అతడి భార్యకు ఫోటోలు పంపిస్తానని నిందితురాలు బ్లాక్ మెయిల్ చేసింది. చివరగా రూ. 3 కోట్లు ఇస్తే వదిలేస్తాననీ చెప్పడంతో బాధితులు ఒప్పుకున్నాడు.

Read Also:Cabinet Meeting: నేడు ధాన్యం కొనుగోలు పై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం

అయితే, హైదరాబాద్ కు వెళుతుండగా మార్గ మధ్యలో కారు ఆపి జేమిమ ముఠా సభ్యులు ఎటాక్ చేశారు. బాధితుడి దగ్గర నుంచి విలువైన వస్తువులు తీసుకోని కత్తితో చంపేందుకు ప్రయత్నం చేశారు. దీంతో వారి దగ్గ నుంచి ఎలాగోలా తప్పించుకుని హైదరాబాద్ కు పారిపోయాడు. ఎన్ఆర్ఐ యువకుడి ఘటన వెలుగులోకి రావడంతో ఫిర్యాదు చేసిన బాధితుడు.. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version