NTV Telugu Site icon

Union Minister Ram Mohan Naidu: ఆ రిపోర్ట్‌ వచ్చిన తర్వాతే బెజవాడ వరద సహాయంపై కేంద్రం నిర్ణయం..

Ram Mohan Naidu

Ram Mohan Naidu

Union Minister Ram Mohan Naidu: ఇంటర్ మినిస్టీరియల్ సర్వే రిపోర్ట్ తర్వాతే బెజవాడ వరదల సహాయంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. వరదల ముంపుపై మాజీ సీఎం జగన్మోహ న్ రెడ్డి చేసిన విమర్శలపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి సహకరించాల్సిన సమయంలో అసబద్ధమైన విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రజలు జగన్ ను చూస్తే భయపడే పరిస్ధితులు వచ్చాయన్నారు రామ్మోహన్ నాయుడు. విశాఖ ఎయిర్ పోర్టులో డీజీ యాత్ర సేవలను ప్రారంభించిన ఆయన.. ఈ యాప్ ద్వారా విమాన ప్రయాణీకుల వ్యక్తిగత సమాచారానికి వచ్చిన ఇబ్బంది ఏమీ వుండదని, తమదే పూర్తి బాధ్యత అని చెప్పారు..

Read Also: Haryana: హర్యానా బీజేపీలో అలకలు.. టికెట్ల నిరాకరణతో నేతల కంటతడి

ఇక, అక్టోబర్ 27వ తేదీ నుంచి విశాఖపట్నం నుంచి నాలుగు కొత్త విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి. వీటిలో విశాఖ-విజయవాడ మధ్య ఒకటి వుండనుంది. ఇక, రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణం కోసం వచ్చిన అభ్యర్థలను, ఫీజబులిటీ రిపోర్ట్, భూమి లభ్యత ఆధారంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. త్వరలోనే దేశంలో సీప్లేన్స్ ప్రవేశ పెడతామని వెల్లడించారు కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో వరద నష్టం అంచనా వేసేందుకు ఇంటర్‌ మినిస్టీరియల్‌ సెంట్రల్‌ టీమ్‌ ఏర్పాటు చేసినట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించిన విషయం విదితమే.. తెలంగాణలో 26 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 2 వైమానికదళ హెలికాప్టర్లు.. ఏపీలో 26 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు 8 వైమానికదళ హెలికాప్టర్లు, 3 నౌకాదళ హెలికాప్టర్లు.. వరద సహాయక చర్యలో పాల్గొంటున్నాయని కేంద్ర హోంశాఖ..

Show comments