NTV Telugu Site icon

Bhupathi Raju Srinivasa Varma: ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ది శరవేగంగా సాగుతోంది..

Bhupathiraju Srinivasa Varm

Bhupathiraju Srinivasa Varm

విశాఖలో నిర్వహించిన బడ్జెట్ పై మేధావుల సమావేశంలో కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్‌లో అన్ని వర్గాలకు సమతుల్యం పాటించారు.. రైతులకు పెద్ద పీట వేశారని తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు.. వ్యవసాయ పెట్టుబడి సమకూర్చే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. కేంద్రం ధన్ వ్యయన్ అనే పథకం తీసుకువచ్చింది.. ఫసల్ బీమా యోజన యధావిధిగా కొనసాగుతోంది.. యూరియా, డీఏపీ ధరల విషయంలో రాయతీలు ఇస్తోందని పేర్కొన్నారు. మరోవైపు.. విద్యకు పెద్ద ఎత్తున 2014లోనే ప్రాధాన్యత ఇచ్చారు.. దేశంలో 360 యూనివర్సిటీలు మంజూరు చేశారని అన్నారు. అధికారంలోకి వచ్చే నాటికి 51 వేల మెడికల్ సీట్లు ఉండేవి.‌. పదేళ్ల కాలంలో లక్షా 10 వేలకు పెంచారని వెల్లడించారు. దేశంలో 18 ఎయిమ్స్, 360 యూనివర్సిటీలు వచ్చాయి.. ఏపీకి 2 ఎయిమ్స్ వచ్చాయని భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. అటల్ ల్యాబ్స్‌ను 50 వేలు ఏర్పాటు చేయనున్నాం.. పాఠశాల స్ధాయిలోనే సృజనాత్మకతను వెలికితీసే ఆలోచనలో ఉన్నామని భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.

Bangladesh: అవమానాలు మరిచిపోయిన బంగ్లాదేశ్.. పాకిస్తాన్‌తో తొలిసారిగా వాణిజ్యం..

కాంగ్రెస్ అధికారంలో ఉంటే రూ.12 లక్షలు ఆర్జించే వ్యక్తి రూ.2 లక్షలు చెల్లించే పరిస్ధితి ఉండేదని భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆరోపించారు. బుల్లెట్ రైళ్ల నిర్మాణం ప్రారంభమైంది.. వందేభారత్ రైళ్లు అధికంగా అందుబాటులోకి తెస్తున్నారని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఒక్క ఏపీకే రైల్వేల అభివృద్ధికి 9,400 కోట్లు కేటాయించారని తెలిపారు. అభివృద్ది విశాఖ చుట్టే తిరిగేలా చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. ఆర్సెలార్ మిట్టల్ ఉక్కు పరిశ్రమకు పనులు మొదలవుతున్నాయన్నారు. మరోవైపు.. ఏఐ పరిశోధనల్లో దేశం ముందుంది.. ఒక ఏఐ సెంటర్ విశాఖలో ఇవ్వాలని కోరితే అశ్వని వైష్టవ్ అంగీకరించారని తెలిపారు. మహిళల కోసం ఉజ్వల యోజన పథకం కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నామని చెప్పారు. ముద్ర యోజన పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచాం.. 13 కులాలకు విశ్వకర్మ యోజన ద్వారా చేయోతనిస్తున్నామని కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు.

Tragedy: పోలవరం కాలువలో పడి ఇద్దరు యువకులు మృతి..

దేశంలో 117 విమానాశ్రయాలు ప్రారంభించాలని నిర్ణయించాం.. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ది శరవేగంగా సాగుతోందని భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. డిజిటల్ చెల్లింపులు సాధ్యమా అని ప్రపంచదేశాలు హేళన చేశాయి.. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ తొలి స్థానంలో ఉండటం గర్వకారణమని అన్నారు. చిరు వ్యాపారస్తులు సైతం డిజిటల్ లావేదేవీలు చేస్తున్నారు.. త్వరలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా మారబోతోందని అభిప్రాయపడ్డారు. మరోవైపు.. పోలవరం, రైల్వేజోన్ నిర్మాణానికి రామాయపట్నంలో రిఫైనరీ ఏర్పాటు జరుగుతోందని భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులు వినియోగించుకోలేని దుస్ధితి గత ఐదేళ్లలో చూశాం.. జలజీవన్ మిషన్ నిధులు పూర్తికాలేదు.. వాటికోసం 2025 నుంచి మరో 3 ఏళ్లు అదనపు గడువు ఇచ్చామన్నారు. వ్యాపారంలో 40 లక్షల టర్నోవర్ చేసే సంస్ధలు జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.. 60 లక్షలకు పెంచే ఆలోచనను కేంద్రానికి తెలుపుతామన్నారు. రెరా ఏక్ట్ తీసుకువచ్చినపుడు నిర్మాణ రంగంలో టెక్నాలజీని జోడించారు.. విశాఖ నుంచి దుబాయ్‌కి విమాన సౌకర్యం అవసరమని చెపుతామని భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు.