Vizag Crime: విశాఖపట్నంలోని పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసారు.. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి.. తాజాగా మరో ట్విస్ట్ వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవడానికి సుపారీ ఇచ్చి మర్డర్ చేయించింది భార్య. ప్రియుడుతో జీవితం పంచుకోవడానికి జీవిత భాగస్వామిని మట్టుబెట్టించింది.. పక్కా స్కెచ్ వేసి రూ. 50 వేలు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.. సుపారీ తీసుకుని హత్య చేసిన నిందితులను.. మృతదేహం లభ్యం అయిన ఘటనా స్థలానికి తీసుకెళ్లి.. సీన్ రీ క్రియేట్ చేశారు పోలీసులు.. ఓ చోట హత్య చేసి.. ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మృతదేహాన్ని పడేసి వెళ్లారు.. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది..
Read Also: Raja Saab : డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 10 రోజుల పాటు హైక్.. ఏపీ జీవోలో ఏముందంటే?
మొత్తంగా పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది.. 40 రోజుల తర్వాత మిస్సింగ్ కేసు మర్డర్ కేసుగా తేలింది.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడు అన్న కారణంతో కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి లేపేసింది భార్య.. మృతుడు నాగరాజుకు రమ్యతో 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు.. అయితే, వసంతరావు తో పరిచయం పెంచుకున్న భార్య రమ్య వివాహేతర సంబంధం కొనసాగించింది.. ఈ నేపథ్యంలో అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు మర్డర్ ప్లాన్ వేసింది.. ప్రియుడు అతని స్నేహితులతో హత్య చేయించి తిమ్మాపురంలోని నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహాన్ని పడేశారు.. తర్వాత భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య.. అయితే, భార్య తీరుపై అనుమానం కలిగిన పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టి కేసు ఛేదించారు… నాగరాజును హత్య చేయించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నూరు అవుతున్నారు.. ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారని వాపోతున్నారు..