Site icon NTV Telugu

Vizag: ఆందోళన బాట పట్టనున్న స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు..

Vizag

Vizag

మరోసారి ఆందోళన బాట పట్టేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు సిద్ధమయ్యారు. జీతాల కోసం సమ్మెకు దిగనున్నారు. ఆరు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయంలో కార్మికులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. ఉక్కు ఉన్నతాధికారులను పిలిచి జేసీఎల్ (JCL) వివరణ కోరింది. కాగా.. ఇప్పటికే కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. మూడు నెలల్లో 6 వేల కోట్లు ఉత్పత్తులు అమ్మకాలు స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఆర్థిక లోటు కారణంగా చూపించి జీతాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ.. వీఆర్ఎస్ సహా కుట్రలతో కార్మికులను బయటకు పంపే కుట్ర జరుగుతోందని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు అయోధ్య రాం పేర్కొన్నారు. కార్మికులు లేకుండా మూడో బ్లాస్ట్ ఫర్నేస్ ఏ విధంగా రన్ చేస్తారో యాజమాన్యం చెప్పాలని కోరారు.

Read Also: Ponnam Prabhakar : అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు అందజేయాలి

కాగా.. ఈనెల 21న తాము సమ్మెలోకి దిగుతున్నట్లు పేర్కొంటూ విశాఖ స్టీ్ల్ ప్లాంట్ కార్మిక సంఘాలు అధికారులకు నోటీసు ఇచ్చారు. మార్చి 7వ తేదీ నుంచి సమ్మె చేపట్టనున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు, సకాలంలో జీతాలు చెల్లించకపోవడం వంటి కారణాలతో కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వం 11 వేల 400 కోట్ల నిధులను కేటాయించింది. అలాగే వీఆర్​ఎస్​ కోసం 500 కోట్ల రూపాయిల నిధులను విడుదల చేసింది. కార్మికుల కనీస డిమాండ్లను యాజమాన్యం పట్టించుకోవడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.

Read Also: Vallabhaneni Vamshi: సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీపై పోలీసులు ప్రశ్నాస్త్రాలు..

Exit mobile version