Site icon NTV Telugu

Team India: సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న టీమిండియా క్రికెటర్లు..

Simhadri

Simhadri

Team India: విశాఖపట్నంలోని ప్రసిద్ధ సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో భారత క్రికెట్ జట్టు ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఇటీవల విశాఖలో పర్యటిస్తున్న టీమిండియా ప్లేయర్లు అప్పన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భారత జట్టుకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. సంప్రదాయ ప్రకారం కప్పస్తంభం ఆలింగనం చేసిన అనంతరం గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read Also: Political Leaders Plane Crashes: బల్వంత్‌రాయ్ మెహతా నుంచి అజిత్ పవార్ వరకు.. ప్లేన్, హెలికాప్టర్ క్రాష్‌లలో ప్రాణాలు కోల్పోయిన రాజకీయ నాయకులు వీరే..!

ఇక, భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ సింహాద్రి అప్పన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారి విశిష్టత, ఆలయ చరిత్రను జట్టు సభ్యులకు వివరించారు. పూజ అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం అందజేయగా, స్వామివారి ప్రసాదంతో పాటు జ్ఞాపికలను ఆలయ అధికారులు భారత క్రికెట్ జట్టు సభ్యులకు అందజేశారు.

Exit mobile version