Ganta Srinivasa Rao: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామివారి సన్నిధిలో సంప్రోక్షణ హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్, పంచకర్ల రమేష్, బాబు గణబాబు ఈ సందర్భంగా హాట్ కామెంట్లు చేశారు గంటా.. గత ప్రభుత్వంలో ఒక తప్పు జరిగింది.. దాన్ని ఎలా.. ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచించుకుండా.. సిగ్గు లేకుండా రాజకీయం మాట్లాడారని ఫైర్ అయ్యారు.. అందుకే వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బాగా బుద్ధి చెప్పారు.. 151 సీట్లు గెలిచిన వైసీపీ.. 11 సీట్లకే పరిమితం అయిందంటే ఈపాటికి మీకు అర్థమయ్యే ఉండాలి అని సూచించారు.. ఇక, వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు అందరు కూడా జనసేనకి, టీడీపీలోకి చేరుకుంటున్నారు.. మీరు ఏకాకి గా మిగిలిపోతారు జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు.. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా దయచేసి రాజకీయాలు చేయొద్దు అని విజ్ఞప్తి చేశారు.. దేవుడి పెట్టిన ధూప దీప నైవేథ్యంలో కూడా మీరు కల్తీ చేశారు.. అడ్డంగా జరిగిపోయి ఇప్పుడు తిరిగి ఎదురు దాడి చేస్తున్నారు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు గంటా శ్రీనివాసరావు..
Ganta Srinivasa Rao: వైసీపీ ఎమ్మెల్యేలంతా టీడీపీ, జనసేనలోకి..! మీరు ఏకాకిగా మిగిలిపోతారు జగన్..!
- సంచలన వ్యాఖ్యలు చేసిన గంటా శ్రీనివాసరావు..
- వైసీపీ ఎమ్మెల్యేలు అంతా జనసేన.. టీడీపీలోకే..
- వైఎస్ జగన్ ఏకాకి గా మిగిలిపోతారని వ్యాఖ్య..

Ganta