విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు రోడ్డెక్కారు. కూర్మన్నపాలెం గేట్ దగ్గర నేషనల్ హైవేపై కార్మికులు బైఠాయించారు. దీంతో పోలీసులు-కార్మికుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ప్రధాని మోడీ విశాఖ పర్యటనలో స్టీల్ ప్లాంట్‌పై సానుకూల ప్రకటన చేయలేదంటూ కార్మికులు ధ్వజమెత్తారు. ఎన్డీఏ ప్రభుత్వ తీరుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Kidney Stones: ఈ కూరగాయలను ఎక్కువగా తీస్తున్నారా? కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు జాగ్రత్త సుమీ
ప్రధాని మోడీ బుధవారం విశాఖలో పర్యటించారు. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ వరకు రోడ్ షో నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని రూ.2లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధికి సహకరిస్తామని.. చంద్రబాబు లక్ష్యాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైల్వే జోన్‌తో ఏపీ ప్రజల కలనెరవేరుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సభలో స్టీల్ ప్లాంట్ గురించి ఎలాంటి వ్యాఖ్యలు ప్రధాని మోడీ చేయలేదు.
ఇది కూడా చదవండి: Daaku Maharaj : డాకు మహారాజ్లో ఆ సీన్‌కు సీట్లు చిరగాల్సిందేనట!