Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై కేబినెట్ కీలక నిర్ణయం.. PPP విధానంలో అప్పగింత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rushikonda Palace: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ భవనాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది.. అయితే, రుషికొండ ప్యాలెస్ నిర్మాణాల వినియోగంపై ఏపీ కేబినెట్లో కీలక చర్చ జరిగింది. రుషికొండ ప్యాలెస్‌ను హాస్పిటాలిటీ, పర్యాటక రంగానికి ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా నాలుగు నెలల పాటు ప్రజల సందర్శనకు ప్యాలెస్‌ను అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు సమాచారం. సందర్శకుల కోసం టికెట్ విధానం అమలు చేసే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.
120 రోజుల్లో PPP విధానంలో అప్పగింత
రుషికొండ ప్యాలెస్‌ను 120 రోజుల్లోగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) విధానంలో హాస్పిటాలిటీ ప్రాజెక్టుగా అప్పగించాలని కేబినెట్లో చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపుతూ తొమ్మిది సంస్థలు పర్యాటక శాఖను సంప్రదించాయి. టాటా గ్రూప్, లీలా ప్యాలెస్, అట్మాస్ఫియర్ కోర్ వంటి ప్రముఖ సంస్థలు ఈ ప్రాజెక్టుపై ఆసక్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సంస్థల ప్రతిపాదనలను పరిశీలించి నాలుగు నెలల్లోగా తుది నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది.
Also Read
- Nara Lokesh: ఏపీని మారిటైం, ఇండస్ట్రియల్ గేట్వేగా తీర్చిదిద్దుతాం.. లోకేష్ కీలక ప్రకటన
- Vishnu Kumar Raju: విశాఖలో బీజేపీ అసంతృప్తి.. డిప్యూటీ మేయర్ పదవిపై విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు
- AP Panchayat Elections: విశాఖ జిల్లాలో కూటమిలో చిచ్చు.. జనసేన వర్సెస్ టీడీపీగా మారిన పంచాయతీ పోరు
- Vizag Crime: ఇన్‌స్టా పరిచయంతో ఇంట్లోకి ఎంట్రీ.. బంగారం, వజ్రాల నగలతో పరారీ..!
మరో నాలుగు ఎకరాల్లో నిర్మాణాలకు అవకాశం
రుషికొండ ప్యాలెస్ ప్రాజెక్టుకు సంబంధించి 2019 నాటి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (CRZ) నిబంధనల ప్రకారం లభించే సడలింపులతో మరో నాలుగు ఎకరాల స్థలంలో కొత్త నిర్మాణాలకు అనుమతి కల్పించే అంశం కూడా చర్చకు వచ్చింది. ఈ స్థలంలో గరిష్ఠంగా 150 గదుల వరకు నిర్మించుకునే అవకాశం కల్పించనున్నారు. దీనివల్ల రుషికొండ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి హాస్పిటాలిటీ, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
నాలుగు నెలల పాటు ప్రజల సందర్శనకు అవకాశం
ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రక్రియ పూర్తయ్యేలోపు నాలుగు నెలల పాటు రుషికొండ ప్యాలెస్‌ను ప్రజల సందర్శన కోసం తెరవాలని నిర్ణయించినట్లు సమాచారం. సందర్శకుల నుంచి టికెట్ వసూలు చేయాలా? టికెట్ ధర ఎంత ఉండాలి? అనే అంశాలపై ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇవ్వనుంది. మొత్తంగా రుషికొండ ప్యాలెస్‌ను పర్యాటక, ఆతిథ్య రంగాలకు ఉపయోగపడేలా మార్చడంతో పాటు ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. రానున్న నాలుగు నెలల్లో ఈ ప్రాజెక్టుపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై కేబినెట్ కీలక నిర్ణయం.. PPP విధానంలో అప్పగింత..!
-
Supreme Court: రేపు దీపత్తూన్ వద్ద దీపం వెలిగించాల్సిందే.. ఆలయ ట్రస్టీలపై సుప్రీంకోర్టు వేటు!
-
January 12 Vidudala: సినిమా అంతా బ్లాక్‌బస్టర్ కళ ఉట్టిపడుతోంది.. ఆ సినిమాపై జీవీ ప్రకాశ్ సెన్సేషనల్ రివ్యూ!
-
Deepam Row: దీపం ఎందుకు వెలిగించలేదు? మధురై కలెక్టర్‌పై సుప్రీంకోర్టు ఫైర్!
-
Lok Sabha Seats Increase: కేంద్రం కీలక నిర్ణయం..! లోక్‌సభ స్థానాలు 50 శాతం పెంపు.. 2051 వరకు డీలిమిటేషన్ ఫ్రీజ్!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!