NTV Telugu Site icon

PM Modi: చంద్రబాబు లక్ష్యాలకు అండగా ఉంటా

Pmmodi

Pmmodi

ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు మేము అండగా ఉంటామని ప్రధాని మోడీ అన్నారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడారు. అంధ్రప్రదేశ్ అన్ని అవకాశాలు ఉన్న రాష్ట్రం అన్నారు. అభివృద్ధిలో ఏపీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. మీ ఆశీర్వాదంతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు ప్రసంగాన్ని విన్నాను. రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తానని. ఏపీ ప్రజల సేవే తమ సంకల్పం అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Donald Trump: అమెరికాలో కెనడా విలీనం.. కొత్త మ్యాప్‌ని షేర్ చేసిన ట్రంప్..

విశాఖలో దక్షిణ రైల్వే జోన్‌కు పునాది వేశామని.. ప్రత్యేక రైల్వేజోన్‌తో ఏపీ ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతోందన్నారు. రైల్వే జోన్‌తో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతోందని.. పర్యాటక రంగంతో కొత్త అవకాశాలు కూడా లభిస్తాయని వెల్లడించారు. మత్స్యాకారుల ఆదాయం పెరిగేలా చూస్తామని.. ఇప్పటికే వారికి కిసాన్ క్రిడెట్ కార్డులు కూడా అందజేసినట్లు తెలిపారు. సముద్రంలో మత్స్యకారుల భద్రత కోసం చర్యలు తీసుకుంటామని… నేడు చేపట్టిన ప్రాజెక్ట్‌లు ఏపీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని మోడీ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Meenakshi Chaudhary: డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా!

గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ ఏపీకి కేంద్రం కాబోతోందని.. దీని ద్వారా ఏపీ నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. మొబైల్ తయారీ రంగంలో ఏపీలో గుర్తింపు తెచ్చుకుందని వెల్లడించారు. ఐటీ, టెక్నాలజీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన కేంద్రం కానుందని.. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధిని సరికొత్త శిఖరాలకు చేరుస్తాయన్నారు. 2030లోగా 5 మిలియన్‌ టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి లక్ష్యమని.. దేశంలో 2 గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లు వస్తుంటే.. దానిలో ఒకటి విశాఖకు కేటాయించామన్నారు. గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ద్వారా ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఏపీలో ఇప్పటికే 7 వందేభారత్‌ రైళ్లు నడుస్తున్నాయని.. అమృత్‌ భారత్‌ కింద ఏపీలోని 70కి పైగా రైల్వేస్టేషన్లు ఆధునికీకరణ చేపట్టినట్లు ప్రధాని వివరించారు. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులు లోకేశ్‌, అనిత, టీజీ భరత్‌, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Martin Guptill: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పేసిన మరో స్టార్ ప్లేయర్

 

 

Show comments