NTV Telugu Site icon

Nirmala Sitharaman: కేంద్ర ప్రభుత్వంగా కాదు.. మా బాధ్యతగా ఏపీకి సహకారం..

Nirmala Sitharaman

Nirmala Sitharaman

Nirmala Sitharaman: కేంద్ర ప్రభుత్వంగా కాదు.. మా బాధ్యతగా ఆంధ్రప్రదేశ్‌కు సహకారం అందిస్తున్నాం అన్నారు.. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరవాత దేశ వ్యాప్తంగా చర్చలు నిర్వహిస్తున్నాం. మొదట ముంబైలో.. రెండో చర్చ విశాఖ లో నిర్వహించాం అన్నారు.. విశాఖలో బడ్జెట్ పై వివిధ వర్గాల ప్రజలను కలసి వారి సలహాలు, సూచనలు తీసుకున్నాం అన్నారు.. ఇక, పోలవరం ప్రాజెక్ట్ కి అధిక ప్రాధాన్యత ఇచ్చాం.. కేంద్ర ప్రభుత్వంగా కాదు, మా బాధ్యతగా సహకారం అందిస్తున్నాం అన్నారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఎక్కువ మొత్తం కేటాయించాం.. స్టీల్ ప్లాంట్ ను పునరాభివృద్ది చేయడానికి 11 వేల కోట్ల సహకారం అందిస్తున్నాం.. పారిశ్రామిక కారిడార్ కు.. కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతి రాజధానికి కూడా సహకారం అందిస్తున్నాం. కేంద్రం, రాష్ట్రం కలిసి చేస్తున్న అన్ని ప్రాజెక్టులకు లోటు లేకుండా కేటాయింపులు చేస్తున్నాం అన్నారు.

Read Also: Supreme Court: సుప్రీంకోర్టుకి చేరిన తమిళనాడు ‘‘హిందీ’’ వివాదం..

అయితే, సాంకేతిక సమస్యలు వలన పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందన్నారు నిర్మలా సీతారామన్‌.. విభజన సమయంలో పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చాము. ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తాం. అది జాతీయ ప్రాజెక్ట్ అని స్పష్టం చేశారు.. ఇక, 12 లక్షలు వరకు టాక్స్ కట్టే అవకాశం లేకుండా వెసులుబాటు ఇచ్చాము. సర్వీస్ సెక్టార్ లో నిర్దిష్టమైన ఆదాయం వస్తుంది. ఇతర దేశాలు తరహాలో మన దేశం అభివృద్ధి చెందాలి అంటే ఆదాయ వనరులు పెంచుకోవాలని సూచించారు.. మరోవైపు.. నేను పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో నివసించి అక్కడ నీటి కష్టాలు అనుభవించాను. జల్ జీవన్ మిషన్ ద్వారా నేరుగా ఇంటికి మంచినీరు ఇచ్చే బృహత్తర ప్రాజెక్టును చేపడుతున్నాము. ఆత్మ నిర్బర్ భారత్, మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాలు చేపట్టకపోతే వినాయక చవితికి విగ్రహం తయారుచేసే మట్టిని కూడా ఇతర దేశాలు నుంచి తెచ్చుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.. విశాఖకు సమీపంలో ఫార్మా రంగం అభివృద్దికి బల్క్ డ్రాగ్ పరిశ్రమలు విస్తృత పరిచామని వెల్లడించారు..

Read Also: Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. అన్నప్రసాదం మెనూలో అదనంగా చేరిన గారె..

మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయంతో సుంకాలు పెరిగే అవకాశం ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వెళ్లి అక్కడ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. అమెరికా సుంకాల పెంపు ప్రభావం మన దేశ ఆర్థిక స్థితి మీద పడుతుందన్నారు.. నూతన పద్ధతులు ద్వారా ఆదాయపను చెల్లింపు విధానం అనేది పన్ను చెల్లింపుదారులకు సులభతరమైన మార్గంగా చేశామని తెలిపారు.. మూడు కోట్ల మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారు.. కొత్త పన్ను వెసులుబాటు ద్వారా ఈ సంఖ్య మరింత తగ్గుతుందన్నారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌..