Vizag Mayor: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు అనూహ్యమైన మలుపులు తిరుగుతున్నాయి. పోటాపోటీ క్యాంప్ లు నడుపుతున్న టీడీపీ, వైసీపీలు శిబిరాలను విదేశాలకు తరలించాయి. దీంతో మేయర్ హరి వెంకట కుమారి అవిశ్వాస పరీక్ష చుట్టూ ఉత్కంఠ రెట్టింపైంది. గ్రేటర్ మేయర్ పీఠంపై కన్నేసిన టీడీపీ నో కాన్ఫిడెన్స్ నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు ఏప్రిల్ 19వ తేదీన ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఎక్స్ ఆఫీస్ లో కలిపి మ్యాజిక్ ఫిగర్ 74 కాగా.. గ్రేటర్‌లో బలాబలాలపై కూటమి, వైసీపీ ఎవరి లెక్కలు వాళ్లవి.. బీజేపీ, జనసేనతో కలిసి తమ బలం 61కి పెరిగిందని.. మేయర్ పదవి దక్కించుకోవడం ఖాయం అనే ధీమాలో కనిపిస్తోంది టీడీపీలో..
Read Also: Vaani Kapoor : వరుస ప్లాపులతో వెనకబడిన వాణి
అయితే, ఈ నెంబర్ గేమ్ ను వైసీపీ పట్టించుకోవడం లేదు. ఎక్స్ ఆఫీషియోతో కలిపి తమ సంఖ్యా బలం 37గా లెక్కేసుకుని అవిశ్వాసం వీగిపోవడం ఖాయం అనే అంచనాకు వచ్చింది. అటు, కూటమి.. ఇటు వైసీపీ రెండు చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగానే తన కార్పొరేటర్లను బెంగుళూరు తరలించేసింది. సమయం దగ్గర పడుతున్న తరుణంలో అనూహ్యంగా శిబిరాన్ని శ్రీలంకకు మార్చేస్తోంది. అందరూ కాల్పోయినా కొంత మందిని షిఫ్ట్ చేయడం అనివార్యంగా భావించినట్టు తెలిసింది. అదే సమయంలో వైసీపీలో గెలిచి ఇటీవలకూటమిలో చేరిన కార్పొరేటర్లతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ప్రస్తుతం వున్న లెక్క ప్రకారం కూటమికి ఇద్దరు సభ్యులు అవసరం వుంది. దీంతో వైసీపీ పూర్తి స్థాయి వ్యూహం పన్ని అమలు చేస్తోంది.
Read Also: Nizamabad: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు మాతృ వియోగం
మరోవైపు, సంఖ్యాబలం కాపాడుకోవడం ఇప్పుడు కూటమికి పెద్ద టాస్క్. దీంతో కొన్నిరోజులుగా భీమిలిలో నడుస్తున్న క్యాంప్ ను మలేషియాకు తరలించింది. తొలి ప్రయత్నంలో 26 మంది విదేశాలకు జంప్ అయ్యారు. నిజంగానే మేయర్ ను దించే సంఖ్యాబలం ఉంటే విదేశాల్లో శిబిరాలు ఎందుకో చెప్పాలని వైసీపీ ప్రశ్నిస్తోంది. మేయర్ పై అవిశ్వాసం ప్రకటించిన కూటమి.. ఇప్పుడు డిప్యూటీ మేయర్ కు నోటీసులు ఇచ్చింది. డిప్యూటీ మేయర్ శ్రీధర్ ను తప్పించాలని భావిస్తుండగా.. జనసేన ఓటు కీలకంగా మారింది.. మొత్తం పార్టీకి 11మంది సభ్యులు ఉండగా.. క్యాంప్ రాజకీయాలు వద్దని హైకమాండ్ వారించినట్టు తెలి
సింది. అయితే, మేయర్ పై అవిశ్వాసం ఆషామాషీ వ్యవహారం కాదని అర్థం కావడంతో అధికార, విపక్షాలు వ్యూహాలు రాటు దే లుతున్నాయి.