NTV Telugu Site icon

MLC Botsa Satyanarayana: సిట్ రిపోర్ట్‌ను బహిర్గతం చేయాలి.. కేంద్రానికి లేఖ రాస్తానన్న బొత్స

Botsa Satyanarayana

Botsa Satyanarayana

MLC Botsa Satyanarayana: వైజాగ్‌లో డ్రగ్స్‌ వ్యవహారం అప్పట్లో కాకరేపింది.. అయితే, విశాఖలో డ్రగ్స్ వ్యవహారంపై నేను మళ్లీ కేంద్రానికి లేఖ రాస్తున్నాను అన్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తాను అన్నారు.. కేంద్ర దర్యాప్తు సంస్థలు మేనేజ్‌కు గురైతే మన పరువు పోతుందన్నారు.. అందుకోసం సిట్ రిపోర్ట్ ను బహిర్గతం చేయాలని లేఖ రాస్తానని వెల్లడించారు.. కంటైనర్ షిప్‌లో డ్రగ్ ఉందని చెప్పి.. చివరికి ఏమీ లేదని తేల్చారు. ఇంటర్ పోల్, ఆపరేషన్ గరుడ పేరుతో విచారణ జరిపి ఏమీ లేదన్నారన్నర ఆయన.. వైజాగ్ కేంద్రంగా డ్రగ్స్ రవాణా జరగకపోవడం సంతోషమే అన్నారు.. కానీ, సీబీఐ విచారణ జరిగిన తీరుపై ప్రధాని, హోం మంత్రికి లేఖలు రాయనున్నట్టు వెల్లడించారు..

Read Also: Technical Error: గాల్లో ఉండగానే సాంకేతిక లోపం.. 2 స్పైస్‌జెట్ విమానాలు దారి మళ్లింపు

ఇక, తుపాన్ వర్షాలు కారణంగా పంటలు దెబ్బ తిన్నాయి. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు బొత్స సత్యనారాయణ.. దీనిపై ఈ నెల 13వ తేదీన అన్ని జిల్లాల వ్యాప్తంగా కలెక్టర్లను కలిసి వినతిపత్రాలు సమర్పించనున్నట్టు వెల్లడించారు.. తగ్గిస్తామని చెప్పి కరెంట్ చార్జీలు కూటమి ప్రభుత్వం పెంచిందని మండిపడ్డారు.. ఆరు స్లబ్స్‌లో చార్జీల భారం ప్రజలపై మోపింది.. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు.. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులు పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించాము. పార్టీ ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించింది. వర్షాలు నేపధ్యంలో రైతాంగం ఇబ్బందులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.. ఇక, ఈ నెల 27వ తేదీన విద్యుత్‌ చార్జీల పెంపుపై విద్యుత్ కార్యాలయాలలో వినతిపత్రలు అందజేస్తాము. విద్యుత్ భారాలను ప్రభుత్వమే భరించాలని కోరారు.. విశాఖ డైరీపై వేసిన సభ సంఘంపై ఎమ్మెల్సీ లను భాగస్వామ్యం చేయాలని లేఖ రాసినట్టు తెలిపారు.. సభ సంఘంలో శాసనమండలిలోని సభ్యులను భాగస్వామ్యం చేయాలని సూచించారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ..