Site icon NTV Telugu

ASHA Workers: మంత్రి నారా లోకేశ్ను కలిసిన ఆశావర్కర్లు.. రాజకీయాల్లోకి లాగొద్దని వెల్లడి!

Lokesh

Lokesh

ASHA Workers: విశాఖపట్నం ఎయిర్ పోర్టులో మంత్రి నారా లోకేష్ ని ఆశ వర్కర్లు కలిశారు. ఈ సందర్భంగా, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలఅంటూ మంత్రికి వినతి పత్రం అందించారు. మూడు సంవత్సరాల కాలం పరిమితి సార్కులర్ రద్దు చేయాలి.. ఉద్యోగ భద్రత కల్పించాలి వేతనాలు వ్యక్తిగత అకౌంట్లో వేయాలి అని ఆశా వర్కర్లు కోరారు. నారా లోకేష్ ఈ విషయంపై సానుకూలంగా స్పందించి ఆశా వర్కర్లను మేము తీసేయం మీరు కొనసాగుతారు అని హామీ ఇచ్చారు. ఇక, టీడీపీ కార్పొరేటర్లు మమ్మల్ని తొలగించమని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు అంటూ ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Sheeshmahal: కేజ్రీవాల్‌ను వెంటాడుతున్న కష్టాలు.. ‘శీష్ మహల్’పై దర్యాప్తునకు కేంద్రం ఆదేశం

అయితే, గత వైసీపీ ప్రభుత్వంలో కండువా వేసుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నామంటే పీడీ బాపూనాయడు ఒత్తిడి కారణంగా అని ఆశా వర్కర్లు తెలిపారు. మొత్తం యూసీడీని వైసీపీ పార్టీ యంత్రంగంగా మార్చారు అని వారు పేర్కొన్నారు. అలాగే, మమ్మల్ని రాజకీయాల్లోకి కూడా లాగొద్దు.. ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగించండి అని వేడుకున్నారు.

Exit mobile version