NTV Telugu Site icon

Minister Nara Lokesh: విశాఖను ఒక బ్రాండ్‌గా మారుస్తాం.. 2029లోపు 5 లక్షల ఐటీ ఉద్యోగాలు..

Lokesh

Lokesh

Minister Nara Lokesh: విశాఖను ఆంధప్రదేశ్ ఐకానిక్ క్యాపిటల్ గా మార్చుతాం.. విశాఖ రీజియన్ పెట్టుబడులకు కేంద్రంగా మారుతోందన్నారు మంత్రి నారా లోకేష్.. ఆర్థిక వృద్ధిలో విశాఖను దేశంలోనే ఐదవ స్థానంలో నిలపాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామన్న ఆయన.. విశాఖను ఒక బ్రాండ్ గా మార్చుతాం.. విశాఖలో 2029లోపు 5 లక్షల ఐటీ ఉద్యోగాలను కల్పిస్తామని స్పష్టం చేశారు.. అనకాపల్లి జిల్లా పర్యటన కోసం.. విశాఖకు వచ్చిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయంగా విశాఖ ఎప్పుడూ మమ్మల్ని ఆదరిస్తూనే వుంది… 2019లో రాష్ట్రం అంతా ఒక విధమైన ఫలితం వస్తే.. ఇక్కడ టీడీపీ గెలిచింది.. 2024 ఎన్నికల మెజారిటీ లో నాదే రికార్డు అనుకున్నా.. గాజువాక, భీమిలిలో నాకంటే ఎక్కువ మెజారిటీలు రావడం ఇక్కడ ప్రజల ఆదరణకు నిదర్శనంగా అభివర్ణించారు..

Read Also: Kethireddy Venkatarami Reddy: పైలట్ అవతారం ఎత్తిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి..

ఇక, విశాఖలో అర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ప్రారంభం కానుంది.. TCS డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు కాబోతోంది.. NTPC హైడ్రో పవర్ గేమ్ చేంజర్ కానుంది అన్నారు మంత్రి లోకేష్.. గతంలో వెళ్ళిపోయిన లులూ గ్రూప్ మళ్ళీ ల్యాండ్ మార్క్ కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి సిద్ధం అవుతోందని వెల్లడించారు.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో విశాఖ రూపు రేఖలు మారిపోనున్నాయి.. అంతర్జాతీయ సదుపాయాలతో మరిన్ని స్టేడియాలను నిర్మాణం చేస్తాం అన్నారు.. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తయ్యేలోపు ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలతో విశాఖ కూడా అంతర్జాతీయ నగరంగా మారుతుందని వెల్లడించారు మంత్రి నారా లోకేష్‌..