NTV Telugu Site icon

Minister Kandula Durgesh: సర్క్యూట్లుగా పర్యాటక రంగ అభివృద్ధి.. త్వరలో పర్యాటక శాఖ ఉత్సవాలు..

Minister Kandula Durgesh

Minister Kandula Durgesh

Minister Kandula Durgesh: రాష్ట్రంలో సర్క్యూట్లుగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం అన్నారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్.. విశాఖ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన పరావస్తు పద్యపీఠం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన్ను ఆయన.. చిన్నయ్య సూరి పేరిట సత్కారం చేశారు.. ఈ సందర్భంగా కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ.. తెలుగు భాష ఔన్నత్యం కోసం కృషి చేసిన చిన్నయ్య సూరి పేరిట సత్కారం పాల్గొనడం ఆనందంగా ఉంది అన్నారు.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక శాఖ నిర్వహించే ఉత్సవాల తేదీలను ప్రకటిస్తామన్నారు.. ఇక, రాష్ట్రంలో సర్క్యూట్లుగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామన్న ఆయన.. విశాఖపట్నం పరిసర ప్రాంతాలను ఒక టూరిజం సర్క్యూట్ గా చేసి అభివృద్ధి చేస్తాం అన్నారు..

Read Also: Telangana Assembly Live 2024: 6వ రోజు కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు..

విజయవాడలో టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టె వారందరితో ఒక సదస్సు నిర్వహించాం. విశాఖ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ముందుకు వస్తున్నారని తెలిపారు మంత్రి కందుల.. విశాఖ తెన్నేటి పార్క్ వద్ద నిలిచిన ఎంవీ మా నౌక ఉన్న ప్రాంతం విశాఖ అటవీ శాఖ పరిధిలోకి వస్తుంది. అటవీశాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నాం.. సంబంధిత అనుమతులు వచ్చిన తర్వాత పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం అన్నారు.. ఇక, ఋషికొండ భవనాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది, తదుపరి నిర్ణయం తీసుకోనుంది అని వెల్లడించారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్..

Read Also: KTR Petition: ఏసీబీ కేసు.. కేటీఆర్ పిటిషన్ కాపీలో పేర్కొన్న అంశాలు ఇవే..