AP Rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురవబోతున్నాయి.. వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా.. ఉత్తర కోస్తా మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.. ఇది సముద్ర మట్టం నుంచి 4.5 కిలోమీటర్లు ఎత్తు లో ఆవరించి ఉందని.. దీని ప్రభావంతో రాగల ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది విశాఖపట్నం వాతావరణం కేంద్రం.. రాగల 24 గంటల్లో విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.. ఈ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది..
Read Also: Andhra Pradesh : సీఎం చంద్రబాబుపై వైసీపీ నేతల ఫైర్ ఆంధ్రాలో అణగారిన రైతుల కోసం ‘అన్నదాత పోరాటం’
ఇక, రేపు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.. ఈ జిల్లాల్లో రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.. మరోవైపు, రాగల ఐదు రోజులు పాటు కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని.. ఎల్లుండి నుంచి 40 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు ఉంటాయని విశాఖపట్నం వాతావరణశాఖ అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు.. ఇక, పాతపట్నంలో 7 సెంటీ మీటర్లు అత్యధిక వర్షపాతం నమోదు అయ్యిందని తెలిపారు.. కాగా, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వర్షాలు అతలాకుతలం చేసిన విషయం విదితమే..
