Facebook love: ఫేస్ బుక్.. ఫేస్ బుక్.. నువ్వేం చేస్తావంటే అపరిచితులిద్దరినీ ఒకటి చేస్తానని, ఆ తర్వాత వారి జీవితాలను చిత్తు చేస్తా అన్నదట. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దారుణాలు చూస్తుంటే అనాలే ఉన్నాయి మరి. ఫేస్ బుక్ లో అమ్మాయిల పేర్లు సెర్చ్ చేయడం బాగుంటే రిక్వస్ట్ పెట్టడం, వారితో చాటింగ్ చేయడం, ఆ తర్వాత ప్రేమ పేరుతో మోసం చేయడం. ఇదే ట్రెండ్ నడుస్తోంది. అయితే అమ్మాయిలు కూడా ఇలాంటి కేటుగాళ్లను నమ్మి మోసపోతున్నారు. తాజాగా ఓ యువతి కూడా ఫేస్ బుక్ మాయలోడి ట్రాప్ లో పడి మోసపోయింది. అతను ఆమెకు ఫేస్ బుక్ రిక్వెస్ట్ పెట్టాడు. అది క్లిక్ చేసిన యువతితో చాటింగ్ మొదలు పెట్టాడు. దానికి ఆయువతి కూడా రిప్లై ఇస్తూ మాటలు కల్పింది. ఆ మాటలు కాస్త వీరిద్దరి పరిచయం ప్లేస్ బుక్ లోనే ప్రేమ వరకు వెళ్లింది. ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నమ్మ బలికాడు దానికి అమ్మాయి కనెక్ట్ అయ్యింది. అతన్ని నమ్మి సర్వం సమర్పించింది. ఆమె వద్ద నుంచి డబ్బులు తీసుకోవడం స్టార్ట్ చేశాడు. అక్కడకూడా కాస్త కూడా అనుమానం రాలేదు యువతికి అతన్ని నట్టేట మునిగిందది. చివరకు నమ్మి మోసపోయానని పోలీసులకు ఆశ్రయించింది. ఈఘటన విజయవాడలో కలకలం రేపింది.
Read also: TIME Magazine Best Places : ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల జాబితాలో మయూర్‌భంజ్, లడఖ్
విశాఖపట్నంలో ఓ యువతికి బ్యూటీ పార్లర్ నిర్వహిస్తుంది. ఆమెతో ఎన్టీఆర్ జిల్లా వెలగలేరు గ్రామానికి చెందిన సుధీర్ కుమార్ తో ఫేస్ బుక్ పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరి మధ్య చాటింగ్ లు మొదలయ్యాయి. ప్రేమిస్తు్న్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెకు దగ్గరయ్యాడు. ఆదగ్గర కాస్త సదరు యువతిని లైంగికంగా సుధీర్ కుమార్ వాడుకున్నాడు. ఆపై కలిసి వ్యాపారం చేద్దామంటూ యువతి నుండి సుధీర్ కుమార్ లక్షల రుపాయలు వసూళ్లు చేశాడు. డబ్బులు తీసుకుని మోహం చాటేయడంతో పోలీసులు ఆశ్రయించిన భాదితురాలు. తనకు న్యాయం చేయాలంటా గవర్నర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతన్ని నమ్మి డబ్బులు ఇచ్చానని, తనని ప్రేమ, పెళ్లి పేరుతో లైంగికంగా వాడుకున్నాడని వాపోయింది. అతన్ని పట్టుకుని తనకు న్యాయం చేయాలని, తన దగ్గర తీసుకున్నా డబ్బులను తిరిగి ఇప్పించాలని కోరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుధీర్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. అతను ఫేస్ బుక్ ద్వారా ఇలా ఇంకా అమ్మాలను ట్రాప్ చేస్తున్నాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Google Doodle: నోబెల్ గ్రహీత బర్త్‌డే.. ఓజోన్ పొరను రక్షించడంలో సహాయపడిన శాస్త్రవేత్త