NTV Telugu Site icon

Andhra Pradesh: మరో నాలుగు రోజులు వడగళ్ల వాన..! వాతావరణశాఖ హెచ్చరిక

Ap

Ap

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.. చేతికి అందివచ్చిన పంట.. అకాల వర్షం నేలపాలు చేసింది.. వేలాది ఎకరాల్లో పంట నష్ట వాటిల్లింది.. అయితే, మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందంటూ వాతావరణశాఖ చేసిన హెచ్చరికలు ఇప్పుడు టెన్షన్‌ పెడుతున్నాయి.. ఏపీలో అకాల వర్షాలు.. మరో నాలుగు రోజులు కురుస్తాయని.. ఈ సమయంలో వడగళ్ల వాన పడుతుందని.. ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణశాఖ.. క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. వడగళ్ల వాన పడుతుందని పేర్కొంది.. ఇక, విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.. సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం కొనసాగుతోంది.. బంగాళాఖాతంలో బలంగా విస్తరిస్తోంది ద్రోణి.. ఉపరితల ఆవర్తనం వల్ల వీచే గాలులు, ద్రోణి ప్రభావంతో వీచే గాలుల కారణంగా ఏర్పడుతున్న క్యుములో నింబస్ మేఘాలతో వర్షం, వడగళ్ల వాన, పిడుగులు పడతాయని హెచ్చరిస్తున్నారు అధికారులు.. పంట పొలాల్లో ఉండే వాళ్లు వర్షం కురిసే సమయంలో.. చెట్లకు దూరంగా ఉండాలని.. సూచించారు.

Read Also: Sonal Chauhan : బీచ్ లో సోనాల్ చౌహన్ సొగసులు చూసి తీరాల్సిందే