Site icon NTV Telugu

GVMC Budget: జీవీఎంసీ బడ్జెట్ సమావేశాలపై ఉత్కంఠ..

Vizag

Vizag

GVMC Budget: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. మేయర్ పై అవిశ్వాసం నోటీసులతో రాజకీయ పక్షాల్లో ఆసక్తి నెలకొంది. ఈ బడ్జెట్ సమావేశాలకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుంది. కాగా, మేయర్ హరి వెంకట కుమారి, ఇద్దరు డిప్యూటీ మేయర్లతో పాటు మరో ఇద్దరు కార్పొరేటర్లు మాత్రమే హాజరు అయ్యే ఛాన్స్ ఉంది. అయితే, బెంగుళూరు క్యాంప్ లో సుమారు 30 మందికి పైగా వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు. ఎన్డీయే కూటమి, వామపక్ష కార్పొరేటర్లు హాజరుతో బడ్జెట్ ఆమోదానికి కోరం సరిపోయే అవకాశం ఉంది.

Read Also: Delhi: మయన్మార్‌కు భారత్ సాయం.. 15 టన్నుల సామగ్రి తరలింపు

అయితే, ఈ వార్షిక బడ్జెట్‌ను జీవీఎంసీ స్థాయి సంఘం ఆమోద ముద్ర డిసెంబర్‌లోనే వేసింది. 2025–26 బడ్జెట్‌ ప్రారంభపు నిల్వ రూ.482.26 కోట్లు, అన్ని పద్దుల కింద జమలు రూ.427.96 కోట్లు, ప్రారంభ నిల్వతో కలిపి మొత్తం జమలు రూ.476.18 కోట్లు, అన్ని పద్దుల కింద ఖర్చులు రూ.460.14 కోట్లుగా ఉంది. ముగింపు నిల్వగా రూ.16.04 కోట్లుగా చూపారు.

Exit mobile version