NTV Telugu Site icon

Heavy to Very Heavy Rains: ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఈ రెండు జిల్లాలకు రెడ్‌ అలర్ట్..

Rains

Rains

Heavy to Very Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండ ప్రభావంతో.. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది.. నైరుతి బంగాళాఖాతంలో ట్రింకోమలీకి తూర్పు ఈశాన్యంగా 110 కిలో మీటర్లు.. నాగపట్టణానికి ఆగ్నేయంగా 310 కి.మీ.. పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కి.మీ… చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 480 కి.మీ దూరంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది.. ఇది రాగల 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని తాకుతూ ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని.. తీవ్రవాయుగుండం ఈరోజు సాయంత్రానికి లేదా రేపు ఉదయానికి తుఫాన్ గా బలపడే అవకాశం ఉందని పేర్కొంది.

Read Also: NIA: భారత దర్యాప్తు సంస్థలా మజాకా!.. ఇక్కడి నుంచే వేరే దేశంలోని ఉగ్రవాదిని ఎలా పట్టుకున్నారో చూడండి..

ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలలో కరైకల్, మహాబలిపురం మధ్య ఈ నెల 30వ తేదీ ఉదయం తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం అంచనా వేస్తోంది.. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ,రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. ఇక, తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు అధికారులు.. అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది.. ప్రకాశం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్‌యంలో ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది.. దక్షిణ కోస్తా తీరం వెంబడి 45 నుంచి 55 వరకు గరిష్టంగా 65 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయని.. కోస్తా తీరంలో మత్య్సకారులు చేపలువేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది.. ఏపీలో ఉన్న అన్ని పోర్టులలో ఒకటివ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.. వ్యవసాయ పనులు చేసుకునే రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం.