Site icon NTV Telugu

Visakhapatnam Airport: ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం విశాఖ పర్యటన.. ఎయిర్‌పోర్ట్‌లో భారీ బందోబస్తు

Visakhapatnam Airport

Visakhapatnam Airport

Heavy Security at Visakhapatnam Airport: అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖపట్నం కేంద్రంగా మారనుంది.. ఇప్పటికే యోగా దినోత్సవానికి సర్వం సిద్ధం చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఇక, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో.. వైజాగ్‌ ఎయిర్ పోర్ట్‌లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌.. విశాఖ ఎయిర్ పోర్ట్‌కు రానున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తారు. ఇక, రాత్రి 7 గంటల 45 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోడీ.. INS డేగా వద్దకు రానున్నారు. INS డేగా వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్వాగతం పలుకనున్నారు. అయితే, వీవీఐపీలు, వీఐపీలు, ప్రముఖుల రాకతో విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.. ఎయిర్ పోర్ట్ లో డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఇప్పటికే విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. కేంద్రమంత్రి వర్మ ఎయిర్ పోర్టు నుండి విశాఖలోని ఒక ప్రైవేట్ హోటల్లో బస చేయటానికి వెళ్లారు.

Read Also: Kubera : కుడి ఎడమైందే..!

Exit mobile version