విశాఖలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో.. కొండ ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నగరంలోని గోపాలపట్నంలో భారీ వర్షాలకు ఇళ్లు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి. కొండవాలు ప్రాంతాల్లో ఉన్న సుమారు 50 ఇళ్లు ప్రమాదపు అంచున ఉన్నాయి. భారీ వర్షాలకు కొండపై ఉన్న ఇళ్ల కింద మట్టి జారిపోతుండటంతో ఇళ్లు కూలిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. దీంతో.. అక్కడి వారు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
Read Also: Rains Effect: ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో రేపు విద్యా సంస్థలకు సెలవు
గోపాలపట్నం, రామకృష్ణ నగర్, కాళీమాత టెంపుల్ వెళ్లే మార్గాల్లో ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న భయం నెలకొంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షల కారణంగా కొండ చర్యలు విరిగి పడి డేంజర్ జోన్గా మారింది. దీంతో.. మట్టి కరిగిపోతే 50 అడుగుల లోతులో పడే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో.. కొంతమంది నివాసితులను అప్రమతం చేసి సురక్షితంగా పునరావాస కేంద్రాలకి తరలించారు అధికారులు. కొందరేమో.. ప్రమాదమని తెలిసినా ఇంకా ఇళ్లల్లోనే ఉన్నారు. మరోవైపు.. చిన్నారులు, వృద్దులు భయాందోళనకు గురవుతున్నారు.
Read Also: Variety Ganesha: మోడీతో కలిసి చాయ్ తాగుతున్న వినాయకుడు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!