NTV Telugu Site icon

Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్ వారికి రాజకీయం… మాకు సెంటిమెంట్..

Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao

Vizag Steel Plant: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ వ్యవహారం మరోసారి పొలిటికల్‌ హీట్ పెంచుతుంది.. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు.. స్టీల్ ప్లాంట్ వైసీపీకి రాజకీయం.. కానీ, మాకు సెంటిమెంట్‌ అని స్పష్టం చేశారు.. తెలుగుదేశం పార్టీ దయతో ఎమ్మెల్సీగా గెలిచిన ఓ సీనియర్ నేత.. భారీ ఓట్ల తేడాతో ఓడిపోయిన మాజీ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలు చేస్తున్నారు… కానీ, స్టీల్ ప్లాంట్ కోసం నా రాజీనామా ఆమోదించకుండా మూడేళ్లు కాలయాపన చేశారు అని దుయ్యబట్టారు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవసరం గనున ఓటు హక్కు రాకుండా అడ్డుకుందామనే దురుద్దేశ్యంతో అప్పటికప్పుడు ఆమోదించారని మండిపడ్డారు.. అయితే, స్టీల్ ప్లాంట్ పై మా విధానం క్లియర్… కచ్చితంగా కాపాడుకుంటామని స్పష్టం చేశారు గంటా శ్రీనివాసరావు.

Read Also: Hyderabad Traffic: హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ మళ్లింపు..

కాగా, వైజాగ్‌ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం తన విధానాన్ని స్పష్టం చేయాలని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేసిన విషయం విదితమే.. కూటమి పార్టీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలమా? లేక వ్యతిరేకమా? చెప్పాలంటూ మాజీ మంత్రి బొత్స ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడాలి.. కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్టీల్ ప్లాంట్ పరిశీలించినా ప్రయోజనం లేకుండా పోయింది.. ప్లాంట్ కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ ఎమ్మెల్సీ బొత్స ప్రకటించిన విషయం విదితమే.. మరోవైపు.. మేం ప్రైవేటీకరణ ఆపగలిగాం.. ఇప్పుడు భాగస్వామ్య పార్టీల మీద ఎన్డీఏ ప్రభుత్వం ఆధారపడి ఉన్న నేపథ్యంలో… సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని సూచించిన విషయం విదితమే.. ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో లేదు. ఉద్దేశపూర్వకంగా అప్పుల ఊబిలోకి నెట్టేశారు అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Show comments