Site icon NTV Telugu

Fog Warning: వాహనదారులకు అలర్ట్.. పొగ మంచు హెచ్చరికలు జారీ.. ఆ తర్వాతే బయల్దేరండి..

Fog Warning

Fog Warning

Fog Warning: సంక్రాంతి సంబరాలు ముగిసాయి.. మరోవైపు, సెలవులు కూడా ముగియడంతో.. పండుగకు సొంత ఊరు వెళ్లినవారు.. అంతా.. హైదరాబాద్‌, బెంగళూరు.. ఇలా వివిధ ప్రాంతాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారు.. దీంతో, విజయవాడ-హైదరాబాద్‌ హైవే రద్దీగా మారింది.. అయితే, ఈ సమయంలో.. వాహనదారులకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.. ఆంధ్రప్రదేశ్‌లో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉదయం 8 గంటల వరకు పొగమంచు ప్రభావం అధికంగా ఉంటుందని, ఆ తర్వాతే వాహనదారులు ప్రయాణాలు చేయాలని సూచించింది.

Read Also: Harsha Vardhan : దొంగ మనసు మార్చేకన్నా ఇంటికి తాళం వేయడం బెటర్.. అనసూయకి హర్షవర్ధన్ కౌంటర్!

శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ జిల్లాల్లో దృశ్యమానత తగ్గడంతో రహదారులపై ప్రమాదాల ముప్పు ఉందని హెచ్చరించింది. సంక్రాంతి పండుగ సెలవులు ముగించుకుని తిరుగు ప్రయాణాలు చేస్తున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. వేగం తగ్గించి వాహనాలు నడపాలని, హెడ్‌లైట్స్ ఆన్‌లో ఉంచుకోవాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం కూడా పొగమంచు పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపింది. అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రోడ్లపైకి రావాలని సూచించింది. పొగమంచు తగ్గిన తర్వాతే ప్రయాణాలు ప్రారంభించడం సురక్షితమని, వాహనదారులు అధికారుల సూచనలను తప్పకుండా పాటించాలని వాతావరణ శాఖ కోరింది.

Exit mobile version