Site icon NTV Telugu

Cyclone Montha: విశాఖలో మొంథా తుఫాన్‌ బీభత్సం..

Cyclone Montha Has Severe I

Cyclone Montha Has Severe I

Cyclone Montha: ఆంధ్రప్రదేశ్‌లో టెన్షన్‌ పెడుతోన్న మొంథా తుఫాన్‌ తీవ్రరూపం దాల్చింది.. విశాఖలో మొంథా తీవ్ర తుఫాన్‌ బీభత్సం కొనసాగుతోంది.. విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద రాకాసి అలలు అలజడి సృష్టిస్తున్నాయి.. 10 అడుగుల ఎత్తులో ఎగసిపడుతున్నాయి రాకాసీ అలలు.. విశాఖ పోర్టుకు ఏడో నెంబర్ ప్రమాదక హెచ్చరికలు జారీచేశారు వాతావరణ శాఖ అధికారులు.. ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారులు ఆందోళనలో ఉన్నారు.. మొంథా తుఫాన్ ను తీవ్రంగా పరిగణిస్తున్నారు మత్స్యకారులు.. లంగర్ వేసిన బోట్లు, పడవలను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.. తాళ్లతో కట్టి కొట్టుకుపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మత్స్యకారులు.. తుఫాన్‌ తీరం తాకే సమయంలో గంటకు 100-110 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా.. బోట్లు కొట్టుకు పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. జెట్టీల లోని సురక్షత ప్రాంతాలకూ బోట్లు తరలింపునకు పడరాని పాట్లు పడుతున్నారు మత్స్యకారులు..

Read Also: Prashant Kishor: బీహార్ ఎన్నికల వేళ అసదుద్దీన్‌కు ప్రశాంత్ కిషోర్ కీలక సలహా

ఇక, కాకినాడకు గ్రేట్ డేంజర్‌ సిగ్నల్ జారీ చేశారు అధికారులు.. కాకినాడ పోర్టులో 10వ నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేయగా.. విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నంలో డేంజర్‌ సిగ్నల్ 9 జారీ చేశారు.. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుకు 8వ నంబర్‌ హెచ్చరికలు జారీ అయ్యాయి.. మరోవైపు, విశాఖపట్నంలో కుండపోత వర్షం కురుస్తుండడంతో.. విశాఖలో అన్ని విమానాలు రద్దు చేశారు అధికారులు.. 36 విమాన సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించారు.. ఇంకోవైపు.. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు.. తుఫాన్‌ ప్రభావంతో ఏపీలో పలు రైళ్లు రద్దు చేశారు.. కోస్తా జిల్లాల మీదుగా నడిచే 95 రైలు సర్వీసులు రద్దు కాగా.. ఈస్ట్‌ కోస్ట్‌ పరిధిలో విజయనగరం, విశాఖ మీదుగా.. రాజమండ్రి, మచిలీపట్నం, గుంటూరు, తిరుపతి, చెన్నై, సికింద్రాబాద్‌ రైళ్లు రద్దు అయ్యాయి.. విశాఖ మీదుగా వెళ్లే 29 రైళ్లు రద్దు చేసిన రైల్వే అధికారులు.. వివిధ రాష్ట్రాల నుంచి విశాఖ వెళ్లే పలు రైళ్లు రద్దు.. నేడు, రేపు ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు..

Exit mobile version