Site icon NTV Telugu

Chandrababu: అచ్యుతాపురం బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు..

Babu

Babu

Chandrababu: అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో గల ఎసైన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారు విశాఖ పట్నంలోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అచ్యుతాపురం ప్రమాద బాధితులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏడుగురు బాధితుల ఆరోగ్యం గురించి డాక్టర్ల దగ్గర నుంచి వివరాలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

Read Also: Kolkata Mudrer Case: సీబీఐ, పోలీసుల రికార్డుల్లో తేడా? సుప్రీంకోర్టులో కొనసాగుతున్న విచారణ

ఈ సందర్భంగా బాధితులతోనూ మాట్లాడి సీఎం చంద్రబాబు త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హమీ ఇచ్చారు. కాగా అనకాపల్లిలోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన రియాక్టర్‌ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందిగా.. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Exit mobile version