Site icon NTV Telugu

GVL: రిక్షావాలాగా మారిన బీజేపీ ఎంపీ.. రిక్షా తొక్కిన జీవీఎల్

Gvl

Gvl

GVL: బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖలో సంక్రాంతి సంబరాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కనుమ రోజున విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఓ రిక్షావాలాను కూర్చోబెట్టుకుని జీవీఎల్ రిక్షా తొక్కారు. సంప్రదాయ పంచెకట్టులో నడుముకు కండువా బిగించి రిక్షా తొక్కారు. తర్వాత.. ఆ రిక్షా కార్మికుడికి కొంత డబ్బులు ఇచ్చారు. అయితే.. దీనికి సంబంధించిన వీడియోను జీవీఎల్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో షేర్ చేశారు.

Read Also: OYO: అయోధ్య, తిరుపతి వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఓయో ప్రాపర్టీలు..

విశాఖలో మహా సంక్రాంతి సంబరాలు నేటితో ముగియనున్న నేపథ్యంలో రిక్షా కార్మికుడు పెంటయ్యను అతని రిక్షాలోనే ఎక్కించుకుని తొక్కాను. తన రిక్షా తొక్కే అవకాశం నాకు ఇచ్చినందుకు అతనికి రుసుం చెల్లించాను అని జీవీఎల్ తెలిపారు. ప్రస్తుతం జీవీఎల్ రిక్షా తొక్కిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Also: Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో మరో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌…వాటికి కూడా ప్రైవసీ..

Exit mobile version