Ayodhya Ram Mandir Set: విశాఖ లోని అయోధ్య రామ మందిరం నమూనా సెట్ నిర్వాహకులకు ఉచ్చు బిగుస్తుంది.. ఆధ్యాత్మిక ముసుగులో కమర్షియల్ గా నిర్వహిస్తున్న రామ మందిరం వివాదం ముదురుతుంది.. అయోధ్య రామ మందిరం నిర్వాహకులపై రెండు ఫిర్యాదులు అందుకున్నారు విశాఖ త్రీ టౌన్ పోలీసులు.. ముగ్గురు నిర్వహకులుపై 318(4) r/w 3(5) BNS కింద త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.. ఇప్పటికే.. త్రీ టౌన్ పోలీసులకి భద్రాచలం ఈవో రమాదేవి ఫిర్యాదు చేయగా.. అనంతరం విశాఖ నుంచి మరొక ఫిర్యాదు అందింది.. త్రీ టౌన్ పోలీసులకి ఫిర్యాదు చేశారు విశాఖ దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ టి. అన్నపూర్ణ..
Read Also: Heavy Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఇక, అన్నపూర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.. ఎఫ్.ఐ.ఆర్ లో కళ్యాణం పోస్టర్ పై ముగ్గురు నిర్వాహకులకు చెందిన మూడు సెల్ ఫోన్ నంబర్లను పొందుపరిచారు… సీతారాముల కళ్యాణం జరుపుటకు రూ.2999కి టికెట్స్ విక్రయించినుట్టు.. అందులో ప్రకటన చేశారని.. ఫిర్యాదులో పేర్కొన్నారు.. నిర్వాహకులు వంగలపూడి దుర్గా ప్రసాద్, రాజా, గరుడ ప్రసాద్ లపై కేసు నమోదు చేయగా.. మరో వైపు త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడానికి సిద్ధమవుతున్నరు దుర్గా ప్రసాద్ బాధితులు… మొత్తంగా.. అయోధ్య రామ మందిరం నమూనా సెట్ వేసి కష్టాల్లో చిక్కుకున్నారు నిర్వాహకులు..
