NTV Telugu Site icon

Atchannaidu: పంచాయతీ శాఖ మంత్రిగా లోకేష్ చరిత్ర సృష్టించారు..

Acchennaidu

Acchennaidu

విశాఖలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిధిగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. వుడా చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో భారీగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు చేశారు. 500 మందితో మెగా రక్తదాన శిబిరం, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. అనంతరం.. 100 కేజీల భారీ కేక్ కట్ చేశారు శ్రేణులు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఏ నిర్ణయమైన ఎన్డీఏ కూటమిలో ఉన్న మూడు పార్టీల పెద్దలు నిర్ణయించి అమలు చేస్తాయని అన్నారు. ఎవరు వద్దన్నా.. కాదన్నా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు తరువాత లోకేష్ నాయకత్వం మాత్రమే అని చిన్న పిల్లాడిని నిద్ర లేపి అడిగిన చాలా క్లియర్‌గా చెప్తాడని తెలిపారు. డిప్యూటీ సీఎం అంశం వ్యక్తిగతంగా ఎవరు తీసుకునేది కాదు.. పదవులైన, నిర్ణయాలైన కూటమి చేస్తుంది.. ఇందులో వ్యక్తిగత అభిప్రాయాలకు తావు లేదని మంత్రి పేర్కొన్నారు.

Read Also: AP Cabinet: వచ్చే నెల 6న ఏపీ కేబినెట్ సమావేశం..

ప్రజలకు సేవ చేయాలనే తపనతో లోకేష్ రాజకీయాలోకి వచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి ప్రియార్టీ కార్యకర్తలే అని చెప్పిన గొప్ప నాయకుడు లోకేష్ అని కొనియాడారు. పంచాయతీ శాఖ మంత్రిగా లోకేష్ చరిత్ర సృష్టించారన్నారు. 27 వేల కి.మీ సిమెట్ రోడ్లు వేశారు.. ప్రతీ కరెంట్ స్తంభానికి లైట్లతో వెలుగులు తెచ్చారు.. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా తాగునీరు అందించారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

Read Also: Uber And Ola: “ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లకు వేర్వేరు ధరలు”.. ఉబర్, ఓలాకు కేంద్రం నోటీసులు..

2019లో దురదృష్టవశాత్తు దుర్మార్గమైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. తెలుగుదేశం పార్టీ ఉండకూడదని కక్ష కట్టి వ్యవహరించారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. 30 ఏళ్ళు తామే అధికారంలో ఉండాలనే దురుద్దేశ్యంతో మొత్తం నాశనం చేశారని దుయ్యబట్టారు. తమ లాంటి వాళ్ళు కూడా జగన్ చర్యలకు ఇబ్బంది పడ్డామని పేర్కొన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనతో అప్పులు పాలై.. రోజు గడవాలంటే కష్టంగా ఉండేదని అన్నారు. 7 నెలల్లో పోయిన నమ్మకాన్ని తిరిగి తీసుకొచ్చామని తెలిపారు. మరోవైపు.. రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి.. ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద ఎక్కువ ఫోకస్ చేశామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.