Araku Valley Weather: పడిపోయిన ఉష్ణోగ్రతలు!.. అరకు లోయలో మంచు అందాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Araku Valley Weather: ఆంధ్రా ఊటీగా, భూతల స్వర్గంగా పేరుగాంచిన అరకు లోయలో మంచు అందాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. చలి తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో అరకు ప్రాంతం మంచు దుప్పటి కప్పుకుంది. ఓవైపు భారీగా కురుస్తున్న మంచు, మరోవైపు గజగజలాడిస్తున్న చలితో పర్యాటకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు అరకులో రికార్డవడంతో పర్యాటక ప్రాంతాల్లో సందడి నెలకొంది. అరకు లోయలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 11 డిగ్రీలకు పడిపోయాయి. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో చలిని, మంచు అందాలను ఆస్వాదించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.
ముఖ్యంగా తెల్లవారుజామునే మాడగడ సన్‌రైజ్ వ్యూ పాయింట్‌కు పర్యాటకులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అక్కడ కనిపిస్తున్న పాలకడలిని తలపించే మేఘాల అందాలను చూసి మంత్రముగ్ధులవుతున్నారు. కొండల మధ్య నుంచి విస్తరించిన తెల్లటి మంచు మేఘాలు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి. మంచు దుప్పటి కప్పేసిన అరకు లోయలో ఉదయం 11 గంటల వరకు సూర్యుడి జాడ కనిపించడం లేదు. చల్లని వాతావరణం, మంచు అందాలతో పర్యాటకులు తమ పర్యటనను ఆస్వాదిస్తున్నారు. మొత్తంగా చలి తీవ్రత పెరగడంతో అరకు లోయ పర్యాటకులతో కళకళలాడుతోంది.
Also Read
- CII Partnership Summit 2026: ఏపీకి భారీ పెట్టుబడుల వెల్లువ.. రెండో రోజు రూ.1.41 లక్షల కోట్ల ఒప్పందాలు..
- CII Partnership Summit Day 2: సీఐఐ సదస్సులో రెండో రోజు కీలక పరిణామాలు.. చంద్రబాబు ఫుల్ బిజీ..!
- CII Partnership Summit: 141 ఒప్పందాలు.. 2.46 లక్షల ఉద్యోగాలు.. విశాఖలో పెట్టుబడుల పండుగ!
- Amit Shah Vizag Visit Cancelled: హోంమంత్రి విశాఖ పర్యటనకు బ్రేక్.. అమిత్ షా పర్యటన రద్దు
తాజావార్తలు
-
Araku Valley Weather: పడిపోయిన ఉష్ణోగ్రతలు!.. అరకు లోయలో మంచు అందాలు..
-
Asus ExpertBook A7: ఆసుస్ ఎక్స్‌పర్ట్‌బుక్ A7 లాంచ్.. 8GB RAM, OLED డిస్ప్లే, 24 గంటల బ్యాటరీ!
-
Kaaka Update: ‘కాకా’లో స్పెషల్ సాంగ్.. రితికాతో ‘మెగాస్టార్’ మాస్ స్టెప్పులు!
-
Low Cost House Construction: రూ.5 లక్షలకే సొంత ఇల్లు.. ఇటుకలు, సిమెంట్ లేకుండానే నిర్మాణం..? అద్భుతమైన టెక్నాలజీ!
-
Rohit-Kohli: రోహిత్, కోహ్లీలకు చివరిసారి.. కివీస్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
-
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!
-
Jio యూజర్లకు బిగ్ షాక్.. ఇకపై ఆ వినియోగదారులకు సేవలు బంద్..? అలర్ట్ మెసేజ్‌లు షురూ..!
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు