NTV Telugu Site icon

Revenue Sadassulu: రేపటి నుంచి రెవెన్యూ సదస్సులు.. చిన్న గ్రామాల్లో ఒక పూట, పెద్ద గ్రామాల్లో రోజంతా..

Ayyanna Patrudu

Ayyanna Patrudu

Revenue Sadassulu: రెవెన్యూ సదస్సులకు సిద్ధం అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం.. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించనున్నట్టు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభలు డిసెంబర్ 6, 2024 – జనవరి 8, 2025 వరకు నిర్వహిస్తామన్నారు.. గ్రామస్థాయిలో భూమి తగాదాలు, రీ సర్వే అవకతవకలను పరిష్కరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశంగా స్పష్టం చేశారు.. ప్రతి మండలంలో.. ఒక గ్రామంలో.. రోజుకు ఒకసారి సమావేశాలు జరుగుతాయి.. చిన్న గ్రామాల్లో ఒక పూట, పెద్ద గ్రామాల్లో రోజంతా ఈ సభలు నిర్వహించబడతాయన్నారు. తహశీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, గ్రామ VRO, మండల సర్వేయర్ వంటి అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు.. అవసరమైతే ఇతర శాఖల అధికారులను కూడా పిలుస్తారని వివరించారు.

Read Also: Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో హిందువులపై ఆగని హింస.. ఇళ్లను వదిలివెళ్లిన కుటుంబాలు

ఇక, ప్రతి మండలానికి డిప్యూటీ కలెక్టర్ పర్యవేక్షణాధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు అయ్యన్నపాత్రుడు.. గత ప్రభుత్వంలో భూముల అక్రమాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఈ సభల ద్వారా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం అని స్పష్టం చేశారు.. ప్రజలు తమ సమస్యల డాక్యుమెంట్లు, దరఖాస్తులు తీసుకురావాలి.. రశీదు ఇవ్వబడుతుందన్నారు.. 45 రోజుల్లో సమస్యల పరిష్కారం ఉంటుంది.. సభల అనంతరం రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ టీం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం పరిశీలించి నివేదిక అందజేస్తుంది.. గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పేర్కొన్నారు ఏపీ అసెంబ్లీ చింతకాయల అయ్యన్నపాత్రుడు.

Show comments