NTV Telugu Site icon

Vizag Honey Trap Case: హనీ ట్రాప్ కేసులో వెలుగులోకి మరో కేసు..

Honey Trape

Honey Trape

విశాఖ హనీ ట్రాప్ కేసులో మరో కేసు వెలుగులోకి వచ్చింది. A1 జాయ్ జెమిమా, A2 వేణు రెడ్డిలపై ఎంవీపీ పోలీస్ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఉద్యోగ నిమిత్తం విశాఖకు వచ్చిన సదరు బాధితుడితో పరిచయం పెంచుకుని వేణు రెడ్డిని పరిచయం చేసింది జమీమా.. ఈ క్రమంలో బాధితుడి వద్ద నుంచి 2 మొబైల్స్ దొంగిలించారు. డబ్బులు ఇవ్వకుంటే పర్సనల్ డేటాను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని బెదిరింపులకు దిగారు.

Read Also: Vastu Tips: పొరపాటున కూడా ఈ వస్తువులు ఇవ్వరికీ ఇవ్వొద్దు..

ఓ ఇంటిలో బాధితుడిని బంధించి.. అతని వద్ద నుండి క్రెడిట్ కార్డులు కాజేసి రెండు లక్షలు కొట్టేసి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు జమీమా, వేణు రెడ్డి. బాధితుడికి మత్తుమందు ఇచ్చి ఇంట్లో నిర్బంధించారు. అనంతరం.. బాధితుడు పోలీసులను ఆశ్రయించి తనకు జరిగిన విషయం మొత్తం చెప్పాడు. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు, మిగతా ముఠా సభ్యులను అరెస్టు చేసేందుకు చర్యలు ముమ్మరం చేశారు.

Read Also: Supreme Court: చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌కు సుప్రీం ధర్మాసనం ఘనంగా వీడ్కోలు

కాగా.. గతంలో కిలాడీ జెమిమాను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు, కీలక ఆధారాలు స్వాధీనం పరుచుకున్నారు. జెమీమా పరిచయాలపై ఆరా తీశారు. హనీ ట్రాప్ కేసులో ఇప్పటికే విస్తుపోయే విషయాలు వెలుగు చూసిన విషయం విదితమే.. తనపై మత్తుమందు చల్లి.. ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను తీసిందని పోలీసులకు వరుసగా బాధితులు కంప్లైంట్ చేయడంతో.. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.