Akkineni Nagarjuna: సినీ హీరో అక్కినేని నాగార్జున ఈ రోజు మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబును కలిశారు.. షూటింగ్ కోసం విశాఖకు వచ్చిన ఆయన.. హరిబాబు ఇంటికి వెళ్లారు.. ఇటీవల అనారోగ్యానికి గురైన హరిబాబు.. విశాఖలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటుండగా.. ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు నాగార్జున.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.. అక్కినేని నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు గవర్నర్ కంభంపాటి హరిబాబు.. అయితే, ఇటీవల నెలకొన్న వివాదంపై మాట్లాడేందుకు మాత్రం నాగార్జున నిరాకరించారు.
కాగా, తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. మాజీ మంత్రి కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతూ.. మధ్యలోకి అక్కినేని ఫ్యామిలీని లాగిన విషయం విదితమే.. కేటీఆర్ వల్లే.. హీరో నాగచైతన్య-హీరోయిన్ సమంత విడాకులు తీసుకున్నారని ఆరోపించిన ఆమె.. హీరోయిన్లు కొంతమంది కేటీఆర్ వల్లే త్వరగా పెళ్లిచేసుకుని ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. అయితే, ఈ వ్యవహారంపై అక్కినేని నాగార్జున.. అమల, చైతన్య, అఖిల్‌తో పాటు.. టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, చిరంజీవి, నాని, వెంకటేష్ సహా ఇలా చాలా మంది సెలబ్రిటీలు.. టాలీవుడ్ ప్రముఖులతో పాటు ఇతర సినీ పరిశ్రమలకు చెందినవారు.. రాజకీయ నేతలు కూడా కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు.. మరోవైపు.. కొండా సురేఖ ఈ వ్యవహారంలో కాస్త వెనక్కి తగ్గారు.. సమంతకు క్షమాపణలు చెప్పారు.. ఇక, హీరో నాగార్జున.. కొండా సురేఖ వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేసేందుకు కూడా సిద్ధం అవుతున్నారు.. కానీ, ఈ పరిణామాలపై మాత్రం ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు. అయితే, ఈ భేటీకి ఏదైనా రాజకీయ ప్రాధాన్యత ఉందా? అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది..