Site icon NTV Telugu

Vizag: వివాహేతర సంబంధం.. ప్రియురాలిపై కత్తితో దాడి..

Knife

Knife

Vizag: విశాఖపట్నంలో అర్ధరాత్రి ఓ వివాహితపై హత్యయత్నం తీవ్ర కలకలం రేపుతుంది. ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలోని HB కాలనీ, స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లో మధ్య వివాహితపై కత్తితో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. గతంలో ఇరువురి మధ్య వివాహేతరా సంబంధం ఉండేది.. గత కొన్నాళ్ళుగా తనను పట్టించుకోకుండా వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో ప్రియుడు పగ పెంచుకున్నాడు.

Read Also: Bengaluru: ఉమెన్స్ కాలేజీ వాష్‌రూమ్‌లో మొబైల్ కలకలం.. ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్ట్

ఇక, నిన్న (శుక్రవారం) రాత్రి మాట్లాడాలి అని వివాహితకు కాల్ చేసి రమ్మన్నాడు ప్రియుడు.. తీరా వచ్చాక మాట మాట పెరిగి వెంటే తెచ్చుకున్న కత్తితో ఆమెను పొడిచేశాడు. కత్తి గాయలతో రక్తపు మరకలతో వెంటనే అక్కడి నుంచి తప్పించుకోని రోడ్డు పైకి వచ్చేసింది సదరు వివాహిత. రోడ్డుపై వెళ్తున్న వాహనాదారులు, స్థానికులు ఆమెను హాస్పిటల్ కు తరలించారు. దీంతో ప్రజలు అందరు రావడంతో అక్కడి నుంచి ప్రియుడు పరారయ్యాడు. ఇక, విషయం తెలుసుకున్న ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుడి కోసం గాలించిన కాసేపటికే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Exit mobile version