Site icon NTV Telugu

ఉద్యోగాల పేరుతో.. యువతులను గలీజ్ దందాలోకి దింపుతున్న ముఠా అరెస్ట్

Untitled Design (15)

Untitled Design (15)

విశాఖలో స్పా పేరుతో అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్న సెంటర్‌ను సీజ్‌ చేశారు పోలీసులు. నిర్వాహకులతో పాటు అరెస్ట్ చేశారు. అయితే.. ఉద్యోగాల పేరుతో యువతులను తీసుకొచ్చి, తర్వాత బలవంతంగా వ్యభిచారం కూపంలోకి దించుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్, సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా ప్రచారం చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఈ అక్రమ దందాపై విశాఖ పోలీసులు కన్నెర్ర చేశారు.

Read Also: Hyderabad: నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే.. కత్తితో పొడిచి దారుణ హత్య.. కేసులో బిగ్‌ట్విస్ట్ ..!

విశాఖలోస్పా పేరుతో అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్న సెంటర్‌ను గుర్తించారు పోలీసులు. స్మార్ట్ సిటీ విశాఖపట్నంలో స్పా సెంటర్లలో అనైతిక కార్యకలాపాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. లగ్జరీ వాతావరణం, శారీరక-మానసిక ప్రశాంతత ఇస్తామంటూ మసాజ్ సెంటర్లు వ్యభిచార దందాను యధేచ్చగా సాగిస్తున్నాయి. టాస్క్‌పోర్స్ పోలీసుల నిర్వహించిన తనిఖీల్లో అసలు విషయం బయటపడింది.

Read Also:Thalaivar173 : రజనీకాంత్ హీరోగా.. కమల్ హాసన్ నిర్మాతగా దర్శకుడు ఎవరంటే?

సిరిపురం, ద్వారకానగర్, రామ్‌నగర్, సీతమ్మపేట వంటి ప్రాంతాల్లో స్పాలు ఏర్పాటు చేసి.. వ్యభిచార దందాను కొనసాగిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. రామాటాకీస్‌లోని ఆర్కిడ్ వెల్ నెస్ స్పా సెంటర్‌పై దాడులు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు పది మంది యువతులను రెస్క్యూ చేశారు. ముగ్గురు విటులతో పాటు ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేశారు.నిబంధనలకు విరుద్ధంగా స్పాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అందమైన యువతులతో పాటు ఆధునిక సౌకర్యాలతో గదులను అలంకరించి రిలాక్సేషన్ పేరుతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి . హైదరాబాద్, గుంటూరు వంటి నగరాల్లో కూడా స్పా సెంటర్ల పేరుతో వ్యభిచారం దందా సాగుతోంది. నార్త్ ఇండియా, థాయ్‌లాండ్, ఇతర దేశాల నుంచి యువతులను తీసుకొచ్చి ఈ పనులు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

Read Also:Kidney Stones: ఈ అలవాట్లు మార్చకోకపోతే మీ కిడ్నీలను మర్చిపోవాల్సిందే.. జాగ్రత్త గురూ..!

ఉద్యోగాల పేరుతో యువతులను తీసుకొచ్చి, తర్వాత బలవంతంగా వ్యభిచారం కూపంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్, సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా ప్రచారం చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. మూసివేసిన గదుల్లో క్రాస్ జెండర్ మసాజ్‌లు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. ఇటువంటి స్పా సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version