నదిలో పడ్డ వ్యక్తిని కాపాడిన పోలీస్.. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించిన పోలీసులు.. ఇలాంటి వార్తలు మనం తరచూ చూస్తుంటాం. కోవిడ్ టైంలో అయితే ఎంతోమంది పోలీసులు తమ ప్రాణాలను త్యాగం చేసి ప్రజల్ని రక్షించారు. ఆపదలో ఎవరు వున్నా.. విధి నిర్వహణలో వున్న పోలీసులు తమ ప్రాణాలకు తెగించి మరీ కాపాడుతుంటారు. ఫ్రెండ్లీ పోలీసులు అనిపించుకుంటూ వుంటారు. గుంటూరు పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు.
https://ntvtelugu.com/tamilnadu-former-built-a-temple-for-his-pet-dog/
ప్రమాదవశాత్తు బావిలో పడిన వృద్ధురాలి ప్రాణాలు కాపాడారు అరండల్ పేట పోలీసులు. సిద్ధార్థ నగర్ ఫస్ట్ లైన్ లో వైద్యం కోసం క్లినిక్ కి వచ్చిందో వృద్ధమహిళ. అయితే, హాస్పిటల్ ఆవరణలో కళ్ళు తిరిగి పోవడంతో ప్రమాదవశాత్తు పక్కనే వున్న బావిలో పడిపోయింది రమాదేవి అనే మహిళ. సమాచారం అందుకుని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. ఆమెని రక్షించారు. బావిలోకి దిగి రమాదేవిని బయటికి తీశారు పోలీసులు. దిగుడుబావిలా వున్న ఆ బావిలో వెంటనే దిగారు. ఆ వృద్ధమహిళను కాపాడి వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు చేసిన ఈ పనికి ప్రశంసలు లభిస్తున్నాయి.
