Vijayawada Politics: విజయవాడ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారంపై రాజకీయ దుమారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Politics: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (VMC) కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజకీయ వివాదానికి దారితీసింది. ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారాన్ని కౌన్సిల్ హాల్లో కాకుండా అంబేద్కర్ కళా వేదికలో నిర్వహించేందుకు VMC అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఎన్నికైన కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులకు అధికారులు అధికారిక సమాచారాన్ని పంపించారు. అయితే, ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అంబేద్కర్ కళా వేదికలో ఏర్పాటు చేయడంపై వైసీపీ కార్పొరేటర్లు, ఆ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బెజవాడ కార్పొరేషన్ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కౌన్సిల్లోనే నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అసెంబ్లీకి ఒక రూల్, కౌన్సిల్‌కు మరో రూల్ ఉంటుందా? అని వైసీపీ కార్పొరేటర్లు అధికారులను ప్రశ్నిస్తున్నారు. అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలు, కార్పొరేటర్లు నేడు కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిరంగ సభ నిర్వహిస్తున్న తరహాలో ఏర్పాటు చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో VMC కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార వేదిక అంశం విజయవాడలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read
- MLA Adinarayana Reddy: రాజీనామాపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన ప్రకటన..
- AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల సందడి.. తుది దశ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు..!
- AP Panchayat Elections: తొలి దశలో బరిలో 21 వేల మందికి పైగా సర్పంచ్ అభ్యర్థులు.. 87 వేల వార్డు అభ్యర్థులు
- Perni Nani: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం.. వెనక్కి తగ్గే వరకు పోరాటం..!
తాజావార్తలు
-
Hanu-Man : రెండు ముక్కలైన ‘హను-మాన్’ ఫ్రాంచైజీ.. ఒకే సినిమాకు రెండు వేర్వేరు సీక్వెల్స్!
-
IND vs NZ: ముగిసిన మూడోరోజు ఆట.. 118 పరుగుల ఆధిక్యంలో భారత్.!
-
Royal Enfield బైక్ లవర్స్‌కు క్రేజీ న్యూస్.. 10 ఏళ్ల వారంటీ.. ఎక్స్ట్రా ఖర్చు లేకుండానే..!
-
Chiranjeevi-Megaverse: ‘మెగావర్స్’లో స్టార్ హీరోల సందడి.. ప్రభాస్, పవన్, చరణ్.. లిస్ట్ ఇంకా పెద్దదే!
-
Vijayawada Politics: విజయవాడ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారంపై రాజకీయ దుమారం
ట్రెండింగ్
-
Hero Splendor+ బైక్ ధరలు పెంపు.. అన్ని వేరియంట్లపై భారీగా పెరిగిన రేట్లు.. కొత్త ధరలు ఇవే!
-
Ball Tampering Scandal: కమిన్స్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే గుడ్‌బై చెబుతా?.. ఆసీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gold Purity: హాల్‌మార్క్ గోల్డ్‌లోనూ కల్తీ.. యంత్రాలకు కూడా దొరకని విధంగా ‘రేడియం పౌడర్’ మిక్స్..
-
IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్ మాకో లెక్కే కాదు.. టీమిండియా కెప్టెన్ హాట్ కామెంట్స్..!
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!