Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీకి బిగ్ షాక్. వంశీని మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు ఈ రోజు ( ఫిబ్రవరి 24) ఆదేశాలు జారీ చేసింది. అయితే, వెన్ను నొప్పి కారణంగా ఇబ్బంది పడుతున్నానంటూ వంశీ దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం స్పందించింది. ఈ సందర్భంగా వంశీకి బెడ్, వెస్ట్రన్ టాయిలెట్ ఏర్పాటు చేయాలని జైలు అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఇక, వంశీని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేయాలని ఎస్సీ, ఎస్టీ కోర్టు పోలీసులను సూచించింది.
Read Also: Delhi: స్పీకర్‌గా విజేందర్ గుప్తా ఎన్నిక.. అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోల తొలగింపుపై ఆప్ రగడ
ఇక, ఈ మూడు రోజుల పాటు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం కచ్చితంగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మెడికల్ టెస్టులు చేయాలని ఎస్సీ, ఎస్టీ కోర్టు పోలీసులకు సూచించింది. అయితే, విజయవాడ లిమిట్స్ లోనే అతడ్ని కస్టడీలోకి తీసుకొని విచారణ చేయాలని జారీ చేసిన ఆదేశాల్లో వెల్లడించింది. అంతేకాకుండా న్యాయవాది సమక్షంలోనే ఈ విచారణ కొనసాగించాలని కూడా పేర్కొనింది. దీంతో పాటు సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీతో పాటు అరెస్టైన ఏ7, ఏ8 ఇద్దరినీ కూడా విచారించడానికి కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది.