Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి మళ్లీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు..
- వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి షాక్..
- వంశీ రిమాండ్‌ను మరోసారి పొడిగించిన విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు.. వంశీకి ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ పొడిగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vallabhaneni Vamsi Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి షాక్ తగినట్టు అయ్యింది.. వల్లభనేని వంశీ రిమాండ్‌ను మరోసారి పొడిగించింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు.. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో నేటితో వల్లభనేని వంశీ రిమాండ్ ముగిసిన నేపథ్యంలో.. వల్లభనేని వంశీని జూమ్ యాప్ ద్వారా విచారించారు న్యాయమూర్తి.. ఆ తర్వాత వంశీకి ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు..
Read Also: Water Melon: పుచ్చకాయలను ఫ్రిజ్‌లో పెట్టి తినేస్తున్నారా? డేంజర్లో పడినట్లే!
Also Read
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
కాగా, వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్‌ను తాజాగా డిస్మిస్ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వంశీని మరోసారి విచారణ చేసేందుకు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ పై ఎస్సీ, ఎస్టీ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేసింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు. ఇక, విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించిన విషయం విదితమే.. మరోవైపు, ఈ కేసు విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేసేందుకు సత్యవర్థన్ తరపు లాయర్ రెండు రోజులు సమయం కోరగా.. దాంతో బెయిల్ పిటిషన్ పై విచారణను 12వ తేదీకి వాయిదా వేసింది.. అదే సమయంలో వల్లభనేని వంశీ ఉంటున్న బ్యారక్ మార్చాలని దాఖలు చేసిన పిటిషన్ పై కూడా విచారణ చేసింది న్యాయస్థానం. కానీ, ఇతర ఖైదీలు ఉంటున్న బ్యారక్ లోకి వంశీని మార్చడం కుదరదని జైలు అధికారులు కోర్టుకు వెల్లడించారు. భద్రతా కారణాలతో బ్యారక్ మార్చలేమన్నారు. ఇక, మెత్తటి దిండు, దుప్పటి కావాలని వంశీ కోరగా, అందుకు జైలు అధికారులు ఒప్పుకున్న విషయం విదితమే. .
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?