NTV Telugu Site icon

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి మళ్లీ షాక్‌.. రిమాండ్‌ అప్పటి వరకు పొడిగింపు..

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi Case: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి షాక్‌ తగినట్టు అయ్యింది.. వల్లభనేని వంశీ రిమాండ్‌ను మరోసారి పొడిగించింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు.. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో నేటితో వల్లభనేని వంశీ రిమాండ్ ముగిసిన నేపథ్యంలో.. వల్లభనేని వంశీని జూమ్ యాప్ ద్వారా విచారించారు న్యాయమూర్తి.. ఆ తర్వాత వంశీకి ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు..

Read Also: Water Melon: పుచ్చకాయలను ఫ్రిజ్‌లో పెట్టి తినేస్తున్నారా? డేంజర్లో పడినట్లే!

కాగా, వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్‌ను తాజాగా డిస్మిస్ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వంశీని మరోసారి విచారణ చేసేందుకు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ పై ఎస్సీ, ఎస్టీ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేసింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు. ఇక, విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించిన విషయం విదితమే.. మరోవైపు, ఈ కేసు విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేసేందుకు సత్యవర్థన్ తరపు లాయర్ రెండు రోజులు సమయం కోరగా.. దాంతో బెయిల్ పిటిషన్ పై విచారణను 12వ తేదీకి వాయిదా వేసింది.. అదే సమయంలో వల్లభనేని వంశీ ఉంటున్న బ్యారక్ మార్చాలని దాఖలు చేసిన పిటిషన్ పై కూడా విచారణ చేసింది న్యాయస్థానం. కానీ, ఇతర ఖైదీలు ఉంటున్న బ్యారక్ లోకి వంశీని మార్చడం కుదరదని జైలు అధికారులు కోర్టుకు వెల్లడించారు. భద్రతా కారణాలతో బ్యారక్ మార్చలేమన్నారు. ఇక, మెత్తటి దిండు, దుప్పటి కావాలని వంశీ కోరగా, అందుకు జైలు అధికారులు ఒప్పుకున్న విషయం విదితమే. .