NTV Telugu Site icon

CP Rajasekhar Babu: వల్లభనేని వంశీ అరెస్ట్‌పై సీపీ కీలక వ్యాఖ్యలు.. తప్పించుకోలేరు..!

Cp Rajasekhar Babu

Cp Rajasekhar Babu

CP Rajasekhar Babu: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబు.. మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్.. ఆ తర్వాత పరిణామాలపై మీడియాతో మాట్లాడిన ఆయన.. వంశీని పోలీసు కస్టడీకి తీసుకుంటామని.. దీని కోసం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తామన్నారు. వల్లభనేని వంశీరి అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించాం.. నేరం చేసిన తర్వాత ఎవరూ తప్పించుకోలేని విధంగా టెక్నాలజీ ఉందన్నారు.. ఇప్పుడు కేసుల్లో ఫోన్స్ కాల్స్, సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు.. ఇక, వల్లభనేని వంశీ కేసుపై టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం.. వంశీని పోలీస్ కస్టడీకి తీసుకుంటాం.. ఇవాళ లేదా రేపు కస్టడీ పిటిషన్ ఫైల్ చేస్తామన్నారు.. విచారణలో ఏ కారు ఎక్కడ నుంచి వచ్చింది.. ఎటు వెళ్లింది అనేది టెక్నాలజీ నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు..

Read Also: Happy Valentines Day 2025: ప్రేమించిన వారికి ప్రేమను ఇలా తెలియజేయండి

కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారుడిగా ఉన్న సత్యవర్ధన్‌ కేసు వెనక్కి తీసుకుంటూ అఫిడవిట్‌ దాఖలు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు.. వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ వ్యవహారంలో వంశీతోపాటు మరికొందరిపై విజయవాడలోని పటమట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్‌ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. 14 రోజుల రిమాండ్‌ రిమాండ్‌ విధించింది కోర్టు. వంశీతో పాటు కేసులో నిందితులుగా ఉన్న లక్ష్మీపతి, కృష్ణప్రసాద్‌కు కూడా 14 రోజుల రిమాండ్‌ విధించారు న్యాయమూర్తి. దీంతో విజయవాడ సబ్‌ జైలుకు తరలించారు. అయితే.. వంశీ రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు కీలక అంశాలను చేర్చారు. సత్యవర్ధన్‌ను బెదిరించడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. వంశీ, అతడని అనుచరులు సత్యవర్ధన్‌ను బెదిరించినట్టు పోలీసులు రిమాండ్‌లో చేర్చారు. అంతేకాదు.. వంశీకి చట్టాలపై గౌరవం లేదని పేర్కొన్నారు.