ప్రేమను వ్యక్తపరచడానికి ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.

మరి ఈ సమయంలో రొమాంటిక్ గా మీ ప్రేమను వ్యక్తపరిచి 'వాలెంటైన్స్ డే' ను జరుపుకోండి.

నా జీవితానికి నీ ప్రేమ కొత్త రంగులు పూసింది. సరికొత్త ఆనందాలను తీసుకొచ్చింది. నువ్వు లేని నా జీవితం అసంపూర్ణం. హ్యాపీ వాలెంటైన్స్ డే డియర్!

నా జీవితంలో చోటు చేసుకున్న ఒకే ఒక అద్భుతానివి నువ్వు. నిన్ను కడదాకా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. హ్యాపీ హ్యాపీ వాలెంటైన్స్ డే!

ఆస్తులు, అంతస్తులు సుఖాన్ని మాత్రమే ఇవ్వగలవు. నీ ప్రేమ మాత్రమే నా పెదాలపై నవ్వులు పూయించగలదు. హ్యాపీ వాలెంటైన్స్​​ డే ప్రాణమా!

నీ చేయి పట్టుకునేందుకు, నీ పెదాలపై నవ్వు చూసేందుకు వేలసార్లు మరణించైనా సరే.. ఒక్కసారి జన్మించడానికి నేను సిద్ధం. హ్యాపీ వాలెంటైన్స్ డే!

నువ్వు కలలు కంటూ ఉండు, నేను వాటిని నెరవేరుస్తూ ఉంటాను. నీ ఆనందాన్ని చూస్తూ నేను సంతోషపడుతూ ఉంటాను.  ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.