NTV Telugu Site icon

Nimmala Ramanaidu: ఇరిగేషన్ ప్రాజెక్ట్ల సీఈ, ఎస్ఈలతో వీడియో కాన్ఫరెన్స్.. మంత్రి ఆదేశాలు

Nimmala

Nimmala

విజయవాడలోని ఇరిగేషన్ మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ల సీఈ, ఎస్ఈలతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. సాయిప్రసాద్, ఈఎన్సీ ఎం. వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువల అత్యవసర పనుల నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసిన రూ. 284 కోట్లతో వెంటనే పనులు చేపట్టాలని మంత్రి ఆదేశం ఇచ్చారు. గత ఐదేళ్ళ జగన్ పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల గేట్లు, షట్టర్లు, రోప్స్‌కు గ్రీజు వంటి వాటికి మరమ్మతులు మాట అటుంచి.. కనీసం గ్రీజు వంటి నిర్వహణ కూడా లేక ఇరిగేషన్ నిర్వీర్యం అయిపోయిందని ఆరోపించారు.

Read Also: War 2 Leaked Pic: యాక్షన్ మోడ్ లో ఎన్టీఆర్.. చూశారా?

రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్ట్‌లలో అత్యవసరంగా చేపట్టాల్సిన 2,323 పనులకు వెంటనే టెండర్లు పిలిచి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. సాగు నీటి ప్రాజెక్టుల ఆపరేషన్, నిర్వహణ కోసం ప్రతి సంవత్సరం రూ. 983 కోట్లు ఖర్చు పెట్టాల్సిఉండగా.. గత ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం రూ. 275 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని అధికారులు మంత్రికి తెలిపారు. ఈ ఏడాదికి అవసరం అయిన రూ. 983 కోట్లు ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు. పంట కాలువలు, డ్రైన్లు, రిజర్వాయర్లు నిర్వహణకు అవసరం అయిన సిబ్బందిని అవుట్ సోర్సింగ్ మేనేజ్‌మెంట్ పద్ధతిన తీసుకోవాలని సీఎం సూచించారు.

Read Also: Dating Fraud: డేటింగ్ ఫ్రాడ్.. అమ్మాయి ఆర్డర్ చేసిన కూల్‌డ్రింక్ ధర రూ.16,400..

గత ప్రభుత్వ అసమర్థ విధానాలు, నిర్వహణా లోపాల కారణంగా.. ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 467 లిఫ్ట్ స్కీంలు మూలన పడ్డాయని, ఈ కారణంగా 2.90 లక్షల ఎకరాల సాగు తగ్గిందని అధికారులు తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉన్న 8.11 లక్షల ఎకరాల సాగుకు అవసరం అయిన 1047 ఎత్తిపోతల పథకాల నిర్వహణ కోసం, రిపేర్లు కోసం 10 ఏళ్లకు యాన్యుటీ పద్ధతిన ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.